iDreamPost
android-app
ios-app

Shah Rukh Khan: రిషబ్ పంత్ యాక్సిడెంట్ ను గుర్తు చేసుకుని షారుఖ్ ఎమోషనల్ వర్డ్స్!

  • Published Apr 30, 2024 | 10:26 AM Updated Updated Apr 30, 2024 | 10:26 AM

తాజాగా స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ యాక్సిడెంట్ ను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

తాజాగా స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ యాక్సిడెంట్ ను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Shah Rukh Khan: రిషబ్ పంత్ యాక్సిడెంట్ ను గుర్తు చేసుకుని షారుఖ్ ఎమోషనల్ వర్డ్స్!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2022, డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన విషయం అందరికి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడాడు పంత్. అయితే ఈ యాక్సిడెంట్ లో మోకాలికి తీవ్రంగా గాయం కావడంతో.. కాలికి సర్జరీ చేశారు. దీంతో అతడు ఆటకు కొన్ని 18 నెలల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇంత త్వరగా పంత్ రికవరీ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ పట్టుదలతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఈ ఐపీఎల్ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంతో తాజాగా స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ యాక్సిడెంట్ ను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు షారుఖ్.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ గెలుపు తర్వాత గ్రౌండ్ లోకి వచ్చిన షారుఖ్ అందరి ప్లేయర్లను ఆత్మియంగా పలకరించాడు. సౌరవ్ గంగూలీతో సరదాగా ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ స్పోర్ట్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్. ఈ ఇంటర్య్వూకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం. ఇందులో రిషబ్ పంత్ యాక్సిడెంట్ ను గుర్తు చేసుకుంటూ.. షారుఖ్ ఎమోషనల్ అయ్యాడు.

“ఆ రోజు నేను రిషబ్ పంత్ కి జరిగిన యాక్సిడెంట్ వార్త విని దిగ్భ్రాంతికి గురైయ్యాను. ఆ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో చూసి షాక్ అయ్యాను. అయితే తరచుగా జరిగే యాక్సిడెంట్స్ ను చూస్తేనే మనకు ఏదోలా అనిపిస్తుంది. అలాంటిది ఓ క్రికెటర్ కు ఇంత భారీ యాక్సిడెంట్ జరగడంతో ఆ బాధ మరింత ఎక్కువైంది. యంగ్ స్టర్స్ కు ఇలా ప్రమాదాలు జరగడం చాలా బాధాకరం. అయితే అతడు ఆ ప్రమాదం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తీరు అమోఘం. కాలికి అయిన సర్జరీ నుంచి త్వరగా కోలుకున్నాడు. అతడి భవిష్యత్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ఎమోషనల్ గా మాట్లాడుకొచ్చాడు. కాగా.. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పార్ట్ 1 ఫుల్ ఎపిసోడ్ శుక్రవారం(మే 1)న టెలికాస్ట్ కాబోతుంది. మరి పంత్ యాక్సిడెంట్ ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన షారుఖ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetHoliganbet girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş