SNP
Karun Nair, KKR, Ranveer Allahbadia: క్రికెటర్ల శృ0గార జీవితం గురించి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ కరున్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..
Karun Nair, KKR, Ranveer Allahbadia: క్రికెటర్ల శృ0గార జీవితం గురించి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ కరున్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
క్రికెటర్లు మ్యాచ్ ఆడుతున్న సమయంలో తీవ్ర భావోద్వేగాలతో ఉంటారు. గెలుస్తుంటే సంతోషం, ఓడుతుంటే బాధ, కోపం ఆవేశం ఇలా.. చాలా ఎమోషన్స్ ఉంటాయి. మ్యాచ్‌కి ముందు, మ్యాచ్ తర్వాత ప్రాక్టీస్‌లో మునిగిపోయి ఉంటారు. టీమిండియాకు ఎంపిక అవ్వాలని కల కంటూ కష్టపడేవారు, అప్పుడప్పుడే టీమిండియాలోకి వచ్చిన యంగస్టర్లు అయితే.. జట్టులో పాతుకుపోవడానికి క్రికెటే ప్రాణంగా బతకాలి.. కొంచెం కూడా ఖాళీ టైమ్ దొరికినా.. ప్రాక్టీస్‌లో మునిగిపోవాలి. అయితే.. ఇంత బీజీగా ఉండే క్రికెటర్ల జీవితాల్లో సెక్స్ ఎలా ఉంటుంది? అని యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ కరున్ నాయర్‌ను అడగాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ..
‘ఇది మీరు పాజిటివ్‌గా అడుగుతున్నారా? నెగిటివ్‌గా అడుగుతున్నారా?.. ఎందుకంటే మీరు చాలా ఓపెన్ ఎండెడ్ ప్రశ్న వేశారు. అయితే.. క్రికెటర్ల జీవితాల్లో సెక్స్ ఉంటుంది. అయినా అది లేకుండా ఏ మనిషి ఉంటాడో చెప్పంది. అయితే క్రికెటర్లు బిజీ షెడ్యూల్‌లో ఉన్న సమయంలో ఇది మంచిదా? చెడ్డదా? అని అడుగుతున్నారా? లేక వాళ్లు ఎన్ని సార్లు, ఎంత చేస్తారని అడుగుతున్నారా? అని నాయర్, రణవీర్‌ను తిరిగి ప్రశ్నించాడు. తర్వాత.. ఆటగాళ్లు సెక్స్ చేస్తారని, అయితే అది ప్రతి ఒక్కరి విషయంలో భిన్నంగా ఉంటుంది. బిజీ షెడ్యూల్ సమయాల్లో చేయాలా? వద్దా అనే తికమకలో కూడా కొంతమంది ఆటగాళ్లు ఉంటారని నాయర్ పేర్కొన్నాడు.
కొంతమంది ఆటగాళ్లు దాన్ని ఇష్టపడితే.. మరికొంతమంది దానికి దూరంగా ఉంటారని తెలిపాడు. ఆటగాళ్లంతా ఇలాగే ఉంటారని చెప్పడానికి కూడా లేదని నాయర్ పేర్కొన్నాడు. అయితే.. తమ సెక్స్ లైఫ్ గురించి కొంతమంది విదేశీ ఆటగాళ్లు కొన్ని సందర్భాల్లో ఓపెన్‌గా మాట్లాడారు కానీ, ఏ భారత క్రికెటర్ కూడా ఈ విషయంపై స్పందించిన దాఖలాలు లేవు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ భార్య సైతం మ్యాచ్‌కి ముందు తన భర్త ఆ కోరిక కోరితే అతనికి సహకరిస్తానని ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. క్రికెటర్లు అందరిలానే ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ ఇంక సెక్సువల్ లైఫ్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.