రోహిత్, కోహ్లీ ఫెయిలైన చోట సెంచరీతో చెలరేగిన అశ్విన్! అతడి సక్సెస్​కు కారణం?

The Secret Behind Ravichandran Ashwin's Success: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనలోని బ్యాటర్​ను మరోమారు నిద్రలేపాడు. బంగ్లాదేశ్​తో తొలి టెస్ట్​లో తన హిడెన్ టాలెంట్​ను ఇంకోసారి బయటపెట్టాడు.

The Secret Behind Ravichandran Ashwin's Success: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనలోని బ్యాటర్​ను మరోమారు నిద్రలేపాడు. బంగ్లాదేశ్​తో తొలి టెస్ట్​లో తన హిడెన్ టాలెంట్​ను ఇంకోసారి బయటపెట్టాడు.

బంగ్లాదేశ్​తో భారత్ టెస్ట్ సిరీస్ అంటే చాలా మంది అభిమానులు లైట్ తీసుకున్నారు. రోహిత్ సేన ముందు ఆ జట్టు నిలబడదని తీసిపారేశారు. రీసెంట్​గా పాకిస్థాన్​ను వాళ్ల సొంతగడ్డపై వైట్​వాష్ చేసినా తక్కువ అంచనా వేశారు. వాళ్ల బౌలింగ్ అటాక్​ను మనోళ్లు చిత్తు చేస్తారని భావించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి టాప్ బ్యాటర్ల జోరును ఆపడం బంగ్లా బౌలర్ల వల్ల అయ్యే పని కాదనుకున్నారు. కానీ తొలి టెస్ట్​ మొదటి సెషన్​లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. 34కే మూడు వికెట్లు పడ్డాయి. రోహిత్, గిల్, కోహ్లీ వెళ్లి పెవిలియన్​లో కూర్చున్నారు. కాసేపు పోరాడిన పంత్, జైస్వాల్ కూడా ప్రత్యర్థి పేసర్ల ధాటికి నిలబడలేకపోయారు. దీంతో భారత్ పనైపోయిందని అనుకున్నారు. కానీ అప్పుడే మ్యాజిక్ స్టార్ట్ అయింది. ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బ్యాట్ తడాఖా చూపించడం స్టార్ట్ చేశాడు. రవీంద్ర జడేజాతో కలసి టీమ్​ను ఒడ్డున పడేశాడు.

అశ్విన్ తనలోని బ్యాటర్​ను మరోమారు నిద్రలేపాడు. ఇవాళ తన హిడెన్ టాలెంట్​ను ఇంకోసారి బయటపెట్టాడు. జోరు మీదున్న బంగ్లా బౌలర్లను చితగ్గొట్టాడు. భారీ సెంచరీతో విజృంభించాడు. 112 బంతుల్లో 102 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ఇందులో 10 బౌండరీలతో పాటు 2 భారీ సిక్సులు ఉన్నాయి. స్పిన్ ఆల్​రౌండర్ జడేజా (117 బంతుల్లో 86 నాటౌట్)తో కలసి ఏడో వికెట్​కు అజేయంగా 195 పరుగులు జోడించాడు. 200 పరుగుల్లోపే చాప చుట్టేస్తుందనుకున్న భారత్ పరువు కాపాడాడు. అశ్విన్-జడ్డూ క్లాస్ బ్యాటింగ్​తో మన టీమ్ తొలి రోజు ఆట ముగిసేసరికి 339 పరుగులతో స్ట్రాంగ్ పొజిషన్​కు చేరుకుంది. కోహ్లీ, రోహిత్, రాహుల్, గిల్, పంత్ లాంటి స్టార్ బ్యాటర్లు ఫెయిలైన చోట అశ్విన్ అలవోకగా పరుగులు చేయడం, సెంచరీతో చెలరేగడం హైలైట్​గా మారింది. అయితే తరచి చూస్తే ఈ దిగ్గజ ఆటగాడి సక్సెస్​కు పలు కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సొంతగడ్డ చెన్నైలో మ్యాచ్ జరుగుతుండటం అశ్విన్​కు కొంత కలిసొచ్చింది. ఎప్పటిలాగే స్పిన్ వికెట్‌ కాకుండా పేస్​కు అనుకూలించే వికెట్​ను తయారు చేయించారు. అయినా అక్కడి కండీషన్స్, బాల్ మూమెంట్, పిచ్ బిహేవియర్, గాలి వీచే దిశ మీద అవగాహన ఉండటం లోకల్ బాయ్​కు బిగ్ ప్లస్​గా మారింది. నిలబడితే పరుగులు వస్తాయని గ్రహించాడు అశ్విన్. జైస్వాల్-పంత్ అలాగే ఆడుతూ రన్స్ చేయడం చూసి తానూ అదే అప్లై చేశాడు. అయితే రాంగ్ షాట్స్​కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. అనవసర షాట్లకు పోకుండా స్ట్రైక్ రొటేషన్​కు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. క్రీజులో సెటిల్ అయ్యాక కూడా బాల్ మెరిట్​ను బట్టి షాట్లు ఆడటం మంచి విషయం. అశ్విన్ తన డిఫెన్స్ టెక్నిక్​ను మెరుగుపర్చుకోవడం కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు అతడికి హెల్ప్ అయింది. దీనికి తోడు రీసెంట్​గా జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్​లో బ్యాట్​తో రాణించడం అతడి కాన్ఫిడెన్స్​, హ్యాండ్-ఐ కోఆర్డినేషన్​ను మరింత పెంచింది. మరి.. అశ్విన్ సక్సెస్​కు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments