iDreamPost
android-app
ios-app

బంగ్లా బౌలర్లను చితకబాదిన అశ్విన్.. తండ్రి కళ్లలో సంతోషం చూడాల్సిందే!

  • Published Sep 19, 2024 | 5:17 PM Updated Updated Sep 19, 2024 | 5:17 PM

Ravichandran Ashwin, IND vs BAN: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు క్లాస్ ఇన్నింగ్స్​తో అలరించాడు.

Ravichandran Ashwin, IND vs BAN: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు క్లాస్ ఇన్నింగ్స్​తో అలరించాడు.

  • Published Sep 19, 2024 | 5:17 PMUpdated Sep 19, 2024 | 5:17 PM
బంగ్లా బౌలర్లను చితకబాదిన అశ్విన్.. తండ్రి కళ్లలో సంతోషం చూడాల్సిందే!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటే చాలా మంది స్పిన్నరే అనుకుంటారు. కానీ బాల్​ను గింగిరాలు తిప్పుతూనే.. సమయం వచ్చినప్పుడు బ్యాట్​తోనూ అతడు మ్యాజిక్ చేస్తాడు. బ్యాట్​ను మంత్రదండంలా తిప్పుతూ పరుగుల వరద పారిస్తాడు. జట్టు కష్టాల్లో పడిన చాలా సార్లు ఆదుకున్నాడు. అతడు తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో అశ్విన్ క్లాస్ ఇన్నింగ్స్​తో అలరించాడు. టీమ్ కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన దిగ్గజ స్పిన్నర్.. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చాడు. స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాతో కలసి ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు. స్కోరు బోర్డు మీదకు ఒక్కో రన్ చేరుస్తూ పోయాడు. బంగ్లా బౌలర్లను అతడు చిదకబాదాడు. దీంతో అశ్విన్ తండ్రి సంతోషం పట్టలేకపోయాడు.

అశ్విన్ బ్యాటింగ్ చూస్తూ అతడి తండ్రి ఎంజాయ్ చేశాడు. చప్పట్లు కొడుతూ, నవ్వుతూ కనిపించాడు. క్రికెట్​లో అశ్విన్ ఎంతో సాధించాడు. అయితే సొంత గ్రౌండ్​లో టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో అతడి తండ్రి సంతోషంలో మునిగిపోయాడు. ఆయనే కాదు.. గ్రౌండ్​లో ఉన్న ఆడియెన్స్ కూడా లోకల్ బాయ్ క్లాస్ బ్యాటింగ్​ను మెచ్చుకున్నారు. అశ్విన్.. అశ్విన్ అంటూ అరుస్తూ ఎంకరేజ్ చేశారు. ఇక, ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు మంచి స్టార్ట్ దొరకలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (6), టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (6) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. శుబ్​మన్ గిల్ (0) డకౌట్ అయ్యాడు. యంగ్ పేసర్ హసన్ మహమూద్ ఈ ముగ్గుర్నీ ఔట్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 56) తన పని తాను చేసుకుంటూ పోయాడు. రిషబ్ పంత్ (52 బంతుల్లో 39)తో కలసి టీమ్​ను ఆదుకున్నాడు. అయితే ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. 144కు 6 వికెట్లు నష్టపోయింది టీమిండియా. ఈ టైమ్​లో క్రీజులోకి వచ్చాడు అశ్విన్.

జడేజా (86 బంతుల్లో 60 నాటౌట్)తో కలసి ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు అశ్విన్ (90 బంతుల్లో 81 నాటౌట్). ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కూల్​గా బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్ల కంటే సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్ రొటేట్ చేయడం మీదే ఎక్కువ ఫోకస్ చేశాడు. మధ్య మధ్యలో ఫోర్లు బాదాడు. 9 బౌండరీలు కొట్టిన అశ్విన్.. ఓ భారీ సిక్స్ బాదాడు. అశ్విన్-జడ్డూ దెబ్బకు బంగ్లా బౌలర్లకు మైండ్​బ్లాంక్ అయింది. మంచి షాట్స్ కొడుతూ ఈజీగా స్ట్రైక్ రొటేట్ చేస్తుండటంతో వాళ్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇద్దరూ క్రీజులో సెటిల్ అవడంతో వాళ్లను ఎలా ఆపాలా అని తలబాదుకుంటున్నారు. ముఖ్యంగా అశ్విన్ టాపార్డర్ బ్యాటర్ మాదిరిగా క్లాస్ ఇన్నింగ్స్​ ఆడుతుండటంతో వాళ్లు బిత్తరపోయారు. భారత్ ప్రస్తుతం 6 వికెట్లకు 303 పరుగులతో ఉంది. అశ్విన్-జడేజా ఇలాగే ఆడితే ఈజీగా 450 మార్క్​ను టచ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.