iDreamPost
android-app
ios-app

డెబ్యూ మ్యాచ్​లోనే స్కాట్లాండ్ బౌలర్ వరల్డ్ రికార్డ్.. వన్డే క్రికెట్​లో ఇదే ఫస్ట్ టైమ్!

  • Published Jul 22, 2024 | 10:20 PM Updated Updated Jul 22, 2024 | 10:20 PM

Charlie Cassell: డెబ్యూ మ్యాచ్​లోనే ఓ స్కాట్లాండ్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు.

Charlie Cassell: డెబ్యూ మ్యాచ్​లోనే ఓ స్కాట్లాండ్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు.

  • Published Jul 22, 2024 | 10:20 PMUpdated Jul 22, 2024 | 10:20 PM
డెబ్యూ మ్యాచ్​లోనే స్కాట్లాండ్ బౌలర్ వరల్డ్ రికార్డ్.. వన్డే క్రికెట్​లో ఇదే ఫస్ట్ టైమ్!

ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఆడటం చాలా మంది ఆటగాళ్ల కల. చిన్నప్పటి నుంచి అహర్నిషలు శ్రమించి, ఎన్నో త్యాగాలు చేస్తూ కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేరు. అయితే ఆ రేంజ్​కు చేరుకోవడం ఒక లెక్కయితే, అక్కడ పెర్ఫార్మ్ చేయడం మరొక లెక్కనే చెప్పాలి. చాలా మంది బెస్ట్ ప్లేయర్స్ డొమెస్టిక్ లెవల్​లో అదరగొట్టినా.. ఇంటర్నేషనల్ క్రికెట్​లో తేలిపోతుండటం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఉండే క్వాలిటీ క్రికెట్, ప్రెజర్, ఎక్స్​పెక్టేషన్స్​ను దాటి రాణించడం అంటే మాటలు కాదు. అందునా తొలి మ్యాచ్​లో ఒక్క పరుగు చేయాలన్నా, ఒక వికెట్ తీయాలన్నా అరంగేట్ర ఆటగాళ్లు ఫుల్ ప్రెజర్​కు లోనవుతారు. అలాంటిది డెబ్యూ మ్యాచ్​లోనే ఓ స్కాట్లాండ్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు.

స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాసెల్ తొలి మ్యాచ్​లోనే సంచలనం సృష్టించాడు. ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా ఒమన్​తో జరిగిన వన్డే మ్యాచ్​లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ప్రత్యర్థి జట్టును అతడు వణికించాడు. ఈ మ్యాచ్​తో వన్డే క్రికెట్​ హిస్టరీలో ఆడిన మొదటి మ్యాచ్​లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా చార్లీ కాసెల్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు డెబ్యూ మ్యాచ్​లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ (6/16) పేరిట ఉండేది. దీన్ని ఇప్పుడు కాసెల్ బద్దలు కొట్టాడు. మొత్తంగా 5.4 ఓవర్లు వేసిన ఈ పేసర్.. 21 పరుగులు ఇచ్చి ఏడుగుర్ని పెవిలియన్​కు చేర్చాడు. ఈ మ్యాచ్​లో ఒమన్ 91 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన స్కాట్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మరి.. డెబ్యూ మ్యాచ్​లోనే స్కాట్లాండ్ బౌలర్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును భవిష్యత్తులో ఇంకెవరైనా అధిగమించగలరని మీరు భావిస్తే కామెంట్ చేయండి.