iDreamPost
android-app
ios-app

నాటి రోహిత్ వార్నింగ్.. నేడు సర్ఫరాజ్ ను సేవ్ చేసింది! ఏం జరిగిందంటే?

  • Published Mar 09, 2024 | 7:13 PM Updated Updated Mar 09, 2024 | 7:59 PM

ఇంగ్లండ్ తో జరిగిన చివరి టెస్ట్ లో సర్ఫరాజ్ ఖాన్ చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురించేసింది. దీంతో అతడు కెప్టెన్ రోహిత్ శర్మకు భయపడ్డాడని అంటున్నారు. మరి ఇంతకీ సర్ఫరాజ్ చేసిన పనేంటి? తెలుసుకుందాం పదండి.

ఇంగ్లండ్ తో జరిగిన చివరి టెస్ట్ లో సర్ఫరాజ్ ఖాన్ చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురించేసింది. దీంతో అతడు కెప్టెన్ రోహిత్ శర్మకు భయపడ్డాడని అంటున్నారు. మరి ఇంతకీ సర్ఫరాజ్ చేసిన పనేంటి? తెలుసుకుందాం పదండి.

నాటి రోహిత్ వార్నింగ్.. నేడు సర్ఫరాజ్ ను సేవ్ చేసింది! ఏం జరిగిందంటే?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లకు ఎంత స్వేచ్ఛను ఇస్తాడో.. అంతే కండిషన్ లో పెడతాడు. ఇక గ్రౌండ్ లో తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తుచేయడంలో సిద్దహస్తుడు హిట్ మ్యాన్. తన మాస్టర్ ప్లాన్స్ తో ఇంగ్లండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకున్నాడు. ఫీల్డింగ్ సెటప్ లో, ఆటగాళ్లను వినియోగించుకోవడంలో రోహిత్ ది ప్రత్యేక శైలి. దీంతో పాటుగా ప్లేయర్ల భద్రతకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అందులో భాగంగానే నాలుగో టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ను గుర్తుపెట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్.. చివరి టెస్ట్ లో ఏం చేశాడంటే?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్ లో చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. ప్లేయర్లు క్యాచ్ లు మిస్ చేస్తే.. తన నోటికి పని చెప్పిన సందర్భాలు చాలానే చూశాం. అయితే ఆటగాళ్ల భద్రత విషయానికి వస్తే మాత్రం రోహిత్ చాలా కఠినంగా ఉంటాడు. ఆ విషయం ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో రుజువైంది. నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో డెబ్యూ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటర్ దగ్గర ఫీల్డింగ్ చేసే క్రమంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో రోహిత్.. నువ్వు హీరో అవుదామనుకుంటున్నావా? హెల్మెట్ పెట్టుకో అని మాస్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇక గత మ్యాచ్ లో ఇచ్చిన వార్నింగ్ ను గుర్తుపెట్టుకున్న సర్ఫరాజ్ చివరి టెస్ట్ లో ఎవ్వరూ చెప్పకపోయినా.. హెల్మెట్ పెట్టుకుని ఫీల్డింగ్ చేశాడు.  ఈ క్రమంలోనే ఇంగ్లండ్ బ్యాటర్ కొట్టిన ఓ బాల్  సర్ఫరాజ్ హెల్మెట్ కు తగిలింది. హెల్మెట్ ఉండటం వల్ల సర్ఫరాజ్ కు పెద్ద ప్రమాదమే తప్పింది. కాగా.. రోహిత్ ఇచ్చిన వార్నింగ్ లో మంచే ఉంది. ప్లేయర్లను ఇలా చూసుకునే కెప్టెన్ ఉండటం సంతోషం అంటూ రాసుకొస్తున్నారు. బాల్ తలకు తగిలితే ఎంత ప్రమాదమో మనందరికి తెలిసిందే. అందుకే ఉడుకు రక్తంతో ఉరకలేసే యంగ్ ప్లేయర్లకు కాస్త గట్టిగానే భయం చెబుతున్నాడు కెప్టెన్ రోహిత్. మరి రోహిత్ హెచ్చరికతో ప్రమాదం నుంచి తప్పించుకున్న సర్ఫరాజ్ ఖాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

ఇదికూడా చదవండి: క్లీన్ బౌల్డ్.. పాపం రివ్యూ కోరిన ఇంగ్లండ్ ప్లేయర్! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు