iDreamPost

క్లీన్ బౌల్డ్.. పాపం రివ్యూ కోరిన ఇంగ్లండ్ ప్లేయర్! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన 5వ టెస్ట్ లో ఇంగ్లండ్ కుర్ర బౌలర్ షోయబ్ బషీర్ అందరిముందు నవ్వులపాలైయ్యాడు. క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత కూడా రివ్యూ కోరాడు. అసలేం జరిగిందంటే?

ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన 5వ టెస్ట్ లో ఇంగ్లండ్ కుర్ర బౌలర్ షోయబ్ బషీర్ అందరిముందు నవ్వులపాలైయ్యాడు. క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత కూడా రివ్యూ కోరాడు. అసలేం జరిగిందంటే?

క్లీన్ బౌల్డ్.. పాపం రివ్యూ కోరిన ఇంగ్లండ్ ప్లేయర్! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

క్రికెట్ లో ఎన్నో రకాల రూల్స్ ఉంటాయి. అయితే వాటన్నింటి గురించి పూర్తిగా తెలియకపోయినా, వాటిపై కనీస అవగాహన మాత్రం కచ్చితంగా ఉండాలి. లేకపోతే.. అందరిముందు నవ్వులపాలవ్వడం, పరువుపోగొట్టుకోవడం జరుగుతుంది. తాజాగా ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన 5వ టెస్ట్ లో ఇంగ్లండ్ కుర్ర బౌలర్ షోయబ్ బషీర్ అందరిముందు నవ్వులపాలైయ్యాడు. క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత కూడా రివ్యూ కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

షోయబ్ బషీర్.. ఇంగ్లండ్ టీమ్ లో కి దూసుకొచ్చిన యువ స్పిన్నర్. తన స్పిన్ తో టీమిండియా బ్యాటర్లనే ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. మూడు టెస్ట్ ల్లో 17 వికెట్లు తీశాడు. అందులో రెండుసార్లు 5 వికెట్లు సాధించాడు. బౌలింగ్ లో సత్తాచాటిన ఈ యువ బౌలర్.. బ్యాటింగ్ మాత్రంలో తేలిపోయాడు. అదీకాక చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన సమయంలో అతడు చేసిన పనికి అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 141 పరుగులుకు 8 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన యంగ్ స్పిన్నర్ బషీర్ సీనియర్ బ్యాటర్ జో రూట్ తో కలిసి కొద్దిసేపు భారత బౌలర్లను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన బషీర్ ని.. ఇన్నింగ్స్ 45.5వ బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు రవీంద్ర జడేజా. అయితే బషీర్ బంతి వికెట్లను తాకింది అన్న విషయం గమనించకుండా.. కీపర్ క్యాచ్ కు అవుట్ ఇచ్చారేమో అని అంపైర్ ను రివ్యూ కోరాడు. దీంతో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న జో రూట్ నవ్వులు చిందించాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి.. బషీర్ మెుఖం చిన్నబుచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. చూసుకోవాలి కదా బ్రో.. అందరిముందు పరువుపోయిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంగ్లండ్ ప్లేయర్ క్లీన్ బౌల్డ్ కి రివ్యూ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by TNT Sports (@tntsports)

ఇదికూడా చదవండి: IPLపై కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ.. ఏమన్నాడంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి