SNP
రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ కుర్రాడు సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ కుర్రాడు సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
SNP
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో ఇండియన్ బ్రాడ్‌మాన్‌గా పేరు తెచ్చుకున్న ఈ కుర్రాడు చాలా కాలంగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. ఏళ్ల నిరీక్షణ తర్వాత.. ఫైనల్‌గా ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌తో సర్ఫరాజ్‌కు అవకాశం దక్కింది. దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్న సర్ఫరాజ్.. సూపర్ బ్యాటింగ్‌తో అందర్ని ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్ ఆడుతూ.. అగ్రెసివ్ ఇంటెంట్‌తో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఆరంభంలోనే టీమిండియా 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో రోహిత్ శర్మ, జడేజా అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన తర్వాత.. క్రీజ్‌లోకి వచ్చిన సర్ఫరాజ్.. రోహిత్ సెట్ చేసిన ప్లాట్‌ఫామ్‌పై అద్భుతంగా రెచ్చిపోయి ఆడాడు. కేవలం 48 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాలా కాలంగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న అతను.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్లు కోల్పోయి.. 301 పరుగులు చేసింది. క్రీజ్‌లో జడేజా, సర్ఫరాజ్ ఉన్నారు. మరి తొలి మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
sarfaraz khan smashed half century in debut match against england in 3rd test#SarfarazKhan #INDvsENGTest pic.twitter.com/BBKFD3nWki
— Sayyad Nag Pasha (@nag_pasha) February 15, 2024