Nidhan
బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌కు టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సారీ చెప్పాడు. మళ్లీ ఆ తప్పు చేయనని అన్నాడు. అసలు సర్ఫరాజ్ ఎందుకు క్షమాపణలు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌కు టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సారీ చెప్పాడు. మళ్లీ ఆ తప్పు చేయనని అన్నాడు. అసలు సర్ఫరాజ్ ఎందుకు క్షమాపణలు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ టీమిండియాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానె లాంటి స్టార్లు లేకుండానే బరిలోకి దిగిన భారత్ అద్భుతాలు చేసింది. కుర్రాళ్లతో నిండిన జట్టు ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. బజ్‌బాల్ బెండు తీస్తూ ఇంగ్లండ్‌ను వరుసగా నాలుగు టెస్టుల్లో చిత్తుగా ఓడించింది. ఈ గెలుపులో కెప్టెన్ రోహిత్ శర్మ సహా సీనియర్ ఆటగాళ్లు అశ్విన్, బుమ్రా, జడేజా కీలక పాత్ర పోషించారు. అరంగేట్ర ఆటగాళ్లు సర్ఫరాజ్, జురెల్, ఆకాశ్ చోప్రా కూడా సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సర్ఫరాజ్, జురెల్ ఈ సిరీస్‌లో అదరగొట్టారు. భారత ఫ్యూచర్ తామేనని ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఈ సిరీస్‌లో రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన సర్ఫరాజ్ సారీ చెప్పాడు.
టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్‌కు సర్ఫరాజ్ క్షమాపణలు చెప్పాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 3 హాఫ్ సెంచరీలు సహా మొత్తం 200 పరుగులు చేసిన సర్ఫరాజ్ మీద ఓ విషయంలో గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. క్రీజులో కుదురుకున్నాక చెత్త షాట్‌తో అతడు తరచూ వికెట్ సమర్పించుకోవడం సరైంది కాదని.. ప్రతిసారీ కొత్త బాల్‌ను ఫేస్ చేస్తున్నాననే ఫీలింగ్‌తో ఆడే డాన్ బ్రాడ్‌మన్ వ్యాఖ్యల్ని గవాస్కర్ ఉదహరించాడు. తన మీద సన్నీ చేసిన కామెంట్స్‌పై సర్ఫరాజ్ కూడా బాధపడ్డాడట. ఈ విషయాన్ని గవాస్కర్‌కు అత్యంత ఆప్తుడు అయిన బిజినెస్‌మన్ శ్యామ్ భాటియా తెలిపాడు. సర్ఫరాజ్‌కు గవాస్కర్ కీలక సూచన చేశాడని.. షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడని చెప్పుకొచ్చాడు.
‘షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సర్ఫరాజ్‌కు గవాస్కర్ హెచ్చరించాడు. దీనిపై దాదాపు 45 నిమిషాల పాటు అతడితో చర్చించాడు. కానీ ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టులో టీ బ్రేక్ తర్వాత చెత్త షాట్ కొట్టి సర్ఫరాజ్ ఔట్ అయ్యాడు. దీంతో గవాస్కర్‌కు కోపం తన్నుకొచ్చింది. కామెంట్రీ సందర్భంగా ఇదే విషయాన్ని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు ఈ విషయం గురించి సర్ఫరాజ్ నాతో మాట్లాడాడు. గవాస్కర్ సార్‌కు సారీ చెబుతున్నానని.. నేను తప్పు చేశానన్నాడు. మళ్లీ ఇలాంటి మిస్టేక్ రిపీట్ కాదన్నాడు’ అని శ్యామ్ భాటియా తెలిపారు. కాగా, ధర్మశాల టెస్టులో దేవదత్ పడిక్కల్‌తో కలసి ఐదో వికెట్‌కు 97 పరుగులు జోడించిన సర్ఫరాజ్.. టీ బ్రేక్ తర్వాత ఔట్ అయ్యాడు. ఆ టైమ్‌లో కామెంట్రీ చేస్తున్న గవాస్కర్.. షాట్ కొట్టేందుకు అనువుగా లేని బాల్‌ను ఆడేందుకు ప్రయత్నించి వికెట్ ఇచ్చేశాడని అన్నాడు. మరి.. గవాస్కర్‌కు సర్ఫరాజ్ సారీ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియా పరువు నిలిపిన కుర్రాళ్లు.. రోహిత్ వల్లే ఇది సాధ్యమైంది!
Sarfaraz Khan says ‘sorry’ to Sunil Gavaskar after poor shot selection in Dharamshala Test https://t.co/vHFy94lJjb
— CricTracker (@Cricketracker) March 13, 2024