iDreamPost

టీమిండియా పరువు నిలిపిన కుర్రాళ్లు.. రోహిత్​ వల్లే ఇది సాధ్యమైంది!

  • Published Mar 13, 2024 | 5:35 PMUpdated Mar 13, 2024 | 5:35 PM

టీమిండియా పరువు నిలిపారు కుర్రాళ్లు. అయితే ఇదంతా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కృషి వల్లే సాధ్యమైంది. కాబట్టి ఎక్కువ క్రెడిట్ హిట్​మ్యాన్​కు ఇవ్వాల్సిందే.

టీమిండియా పరువు నిలిపారు కుర్రాళ్లు. అయితే ఇదంతా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కృషి వల్లే సాధ్యమైంది. కాబట్టి ఎక్కువ క్రెడిట్ హిట్​మ్యాన్​కు ఇవ్వాల్సిందే.

  • Published Mar 13, 2024 | 5:35 PMUpdated Mar 13, 2024 | 5:35 PM
టీమిండియా పరువు నిలిపిన కుర్రాళ్లు.. రోహిత్​ వల్లే ఇది సాధ్యమైంది!

భారత క్రికెట్ జట్టు మునుపెన్నడూ లేనంత పవర్​ఫుల్​గా ఇప్పుడు కనిపిస్తోంది. అటు వన్డేలు, టీ20ల నుంచి ఇటు టెస్టుల వరకు టీమిండియాకు తిరుగుండటం లేదు. గతేడాది ఆసియా కప్ నుంచి మొదలుకొని రీసెంట్​గా ముగిసిన ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్ వరకు అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ సేన డామినేషన్ చూపించింది. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తప్పితే అన్ని టోర్నీల్లోనూ భారత్ ఆధిపత్యమే నడిచింది. ముఖ్యంగా టెస్టుల్లో టీమ్ ఆడుతున్న తీరు.. యంగ్ బ్యాటర్లు శుబ్​మన్ గిల్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్​తో పాటు ఆకాశ్​దీప్ లాంటి యువ బౌలర్ ఇస్తున్న పెర్ఫార్మెన్స్ తీరును మెచ్చుకోకుండా ఉండలేం. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్​లో ఇది ప్రతిబింబించింది. ర్యాంకుల్లో భారత్ పరువును నిలబెట్టారు కుర్రాళ్లు. అయితే ఇది రోహిత్ వల్లే సాధ్యమైంది.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో టీమిండియా సత్తా చాటింది. మన జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. సారథి రోహిత్ 751 పాయింట్లతో ర్యాంకింగ్స్​లో 6వ స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు ఏడో ప్లేసులో ఉన్న హిట్​మ్యాన్ ఒక స్థానం ఎగబాకాడు. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (740 పాయింట్లు) టాప్-10లోకి దూసుకొచ్చాడు. అతడు రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 8వ ప్లేసులో నిలిచాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (737 పాయింట్లు) ఒక స్థానం దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్​తో సిరీస్​ మొత్తానికి దూరమవడం వల్లే విరాట్ ర్యాంకింగ్ తగ్గింది. ఇక, ఇంగ్లీష్ టీమ్​తో సిరీస్​లో బ్యాట్​తో వీరవిహారం చేసిన శుబ్​మన్ గిల్ కూడా తన కెరీర్​లో బెస్ట్ ర్యాంకును పొందాడు. 11 స్థానాలు ఎగబాకిన యంగ్ బ్యాటర్.. 20వ ర్యాంక్​కు చేరుకున్నాడు.

టెస్టు ర్యాంకింగ్స్​లో కేన్ విలియమ్సన్ (859 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా సిరీస్​లో దుమ్మురేపడంతో అతడు తన స్థానాన్ని కాపాడకున్నాడు. భారత పర్యటనలో మోస్తరుగా రాణించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్​లో భారత ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (870 పాయింట్లు) ఒక స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్​కు చేరుకున్నాడు. జోష్ హేజల్​వుడ్, పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా వరుసగా 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 7వ ప్లేస్​లో నిలిచాడు. ఇక, బ్యాటింగ్ ర్యాంకింగ్స్​లో భారత్ పరువును కాపాడిన కుర్రాళ్లు జైస్వాల్, గిల్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. రోహిత్, కోహ్లీ ఎలాగూ ర్యాంకింగ్స్​లో ఉంటారని.. కానీ వాళ్లతో పాటు లిస్ట్​లో ఉండి సత్తా చాటడం మంచి విషయమని అంటున్నారు. వీళ్లే భారత్ భవిష్యత్తు అని మెచ్చుకుంటున్నారు. అయితే రోహిత్ ఎంకరేజ్​మెంట్, ఫెయిలైనా టీమ్​లో ప్లేస్ ఫిక్స్ అనే భరోసా ఇవ్వడం వల్లే ఈ కుర్రాళ్లు ఈ స్థాయిలో రాణిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. టెస్టు ర్యాంకింగ్స్​లో మన కుర్రాళ్లు సత్తా చాటడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఇంగ్లండ్ సిరీస్​తోనే రీఎంట్రీ ఇద్దామనుకున్నా.. కానీ వాళ్లే ఆపారు: పంత్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి