SNP
Sarfaraz Khan, India vs England: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్టులో విజయం కోసం అప్పుడే ప్లాన్స్ మొదలుపెట్టింది. అందుకోసం కత్తిలాంటి కుర్రాడ్ని రంగంలోకి దింపింది. అతనే రెండో టెస్టులో టీమిండియాకు మరో కోహ్లీగా మారనున్నాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
Sarfaraz Khan, India vs England: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్టులో విజయం కోసం అప్పుడే ప్లాన్స్ మొదలుపెట్టింది. అందుకోసం కత్తిలాంటి కుర్రాడ్ని రంగంలోకి దింపింది. అతనే రెండో టెస్టులో టీమిండియాకు మరో కోహ్లీగా మారనున్నాడు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలయించిన టీమిండియా.. అనూహ్యంగా ఓటమి పాలైంది. దీంతో.. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ముందంజలో ఉంది. ఇక మిగిలిన నాలుగు టెస్టుల్లో సత్తా చాటాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ సిరీస్‌లో విజయం సాధిస్తేనే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది.
దీంతో ఎలాగైనా రెండో టెస్ట్‌లో కచ్చితంగా గెలిచి తీరాలని రోహిత్ సేన గట్టి పట్టుదలతో ఉంది. కానీ, రెండో టెస్టుకు ఫామ్‌లో ఉన్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరం కావడంతో టీమిండియా మరింత కష్టాల్లో పడింది. తొలి టెస్టులో జడేజా, రాహుల్ ఇద్దరు మంచి ప్రదర్శన కనబర్చారు. ఇద్దరు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీకి చేరువగా వచ్చి అవుట్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరూ రెండో టెస్టుకు గాయాలతో దూరం అయ్యారు. అయితే.. వారి ప్లేస్‌లో సెలెక్టర్లు ఓ ముగ్గురు యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. వారిలో డొమెస్టిక్ క్రికెట్‌లో కోహ్లీగా పేరొందిన ఓ చిచ్చరపిడుగులాంటి ఆటగాడు కూడా ఉన్నాడు. చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న అతనికి ఎట్టకేలకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది.
ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్ట్‌లో అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో ఇంగ్లండ్‌కు సరైనోడిని దింపుతున్నారంటూ క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ డొమెస్టిక్ కోహ్లీ ఎవరంటే.. సర్ఫరాజ్ ఖాన్. జడేజా, రాహుల్ దూరం కావడంతో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను రెండో టెస్టుకు ఎంపిక చేశారు. వీరిలో సర్ఫరాజ్ ఖాన్ ఎంపికపై క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్‌ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే.. అతని డొమెస్టిక్స్ రికార్డ్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి. నిజానికి సర్ఫరాజ్ ఎప్పుడో ఎంపిక కావాల్సింది. కానీ, ఇప్పుడు అతని అవకాశం వచ్చింది. సర్ఫరాజ్ దేశవాళి క్రికెట్ ఎంతో అద్భుతంగా ఆడుతున్నాడో తెలుసుకోవడానికి జస్ట్.. అతని చివరి మూడు రంజీ ట్రోఫీ సీజన్లు చూస్తే చాలు.
2019-20 సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ 154.7 సగటుతో 928 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 2 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. ఇక 2021-22లో 6 మ్యాచ్‌లు ఆడి 122.8 సగటుతో 982 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2022-23 రంజీ సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడి 107.8 యావరేజ్‌తో 431 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇలా దేశవాళి క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తూ.. డొమెస్టిక్ కోహ్లీగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన టాలెంట్‌ను టీమిండియాలో చూపించి.. తన ప్లేస్‌ను పర్మినెంట్ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. మరి ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు సర్ఫరాజ్ బరిలోకి దిగబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sarfaraz Khan’s performance in the last three Ranji Trophy seasons has been simply remarkable and incredible.
Best wishes for the new chapter – Sarfaraz Khan❤️🙌 pic.twitter.com/sWpdGcG2eZ
— CricTracker (@Cricketracker) January 29, 2024