iDreamPost
android-app
ios-app

కటిక పేదరికంలోనూ.. ఇద్దరు కొడుకులను స్టార్లుగా మార్చిన తండ్రి కథ!

  • Published Feb 01, 2024 | 4:27 PM Updated Updated Feb 16, 2024 | 4:19 PM

Sarfaraz Khan Father Naushad Khan: సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇండియాకు ఎంపికయ్యాడు, అతని తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో అదరగొడుతున్నాడు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు సక్సెస్‌ఫుల్‌ అవుతున్నారు. అయితే వీరి సక్సెస్‌ వెనుక వాళ్ల తండ్రి కష్టం ఎంతో ఉంది. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Sarfaraz Khan Father Naushad Khan: సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇండియాకు ఎంపికయ్యాడు, అతని తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో అదరగొడుతున్నాడు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు సక్సెస్‌ఫుల్‌ అవుతున్నారు. అయితే వీరి సక్సెస్‌ వెనుక వాళ్ల తండ్రి కష్టం ఎంతో ఉంది. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 01, 2024 | 4:27 PMUpdated Feb 16, 2024 | 4:19 PM
కటిక పేదరికంలోనూ.. ఇద్దరు కొడుకులను స్టార్లుగా మార్చిన తండ్రి కథ!

పిల్లల భవిష్యత్తే తమ బాధ్యతగా బతికే తల్లిదండ్రులు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా తండ్రి పడే కష్టం.. పిల్లలకు మంచి లైఫ్‌ ఇవ్వడం కోసమే అయిఉంటుంది. జీవితంలో బాగా స్థిరపడితే సరిపోదు.. దేశం గర్వించేలా ఎదగాలనే తపన ఉన్న తండ్రి.. అందుకోసం మరింత కష్టపడాలి. అలాంటి వ్యక్తే ఒకరునున్నారు. తన ఇద్దరు కొడుకులను ఇండియా గర్వించే క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే అతని లక్ష్యం. అందుకోసం ఆ వ్యక్తి తన జీవితం మొత్తం ధారబోశాడు.. ఇప్పుడిప్పుడే ఆయన కన్న కలలు నెరవేరుతూ.. ఆయన పడిన కష్టానికి ఫలితం దక్కబోతుంది. అలా ఇద్దరు కొడుకులను స్టార్లుగా మార్చిన తండ్రి కథే.. ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే ఒక యువ క్రికెటర్‌ పేరు భారత క్రికెట్‌ వర్గాల్లో మారుమోగిపోతుంది. ఆ క్రికెటర్‌ పేరు సర్ఫరాజ్‌ ఖాన్‌. ముంబైకి చెందిన ఈ ఆటగాడు.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. చాలా కాలంగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌.. ఎట్టకేలకు టీమిండియా తరఫున ఆడుతుండటంతో భారత క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. నిజానికి అతను గతంలోనే ఇండియాకు ఆడతాడని చాలా మంది భావించారు. కానీ, అదృష్టం కలిసి రాక ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు టీమిండియా తరఫున ఆడుతుండటంతో ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఉన్నారు.

Naushadh khan makes his sons super cricketers

సర్ఫరాజ్‌ టెస్ట్‌ క్యాప్‌ అందుకున్న సమయంలో అతని తండ్రి, భార్య గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన అందరి చేత కంటతడి పెట్టించింది. క్యాప్‌ అందుకున్న తర్వాత.. సర్ఫరాజ్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి.. తన తండ్రిని కౌగిలించుకున్న వీడియో.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఆడిన తొలి ఇన్నింగ్స్‌తోనే సర్ఫరాజ్‌ తాను ఎలాంటి ప్లేయరో, తనను ఇన్ని రోజులు పక్కనపెట్టి ఎంత పెద్ద తప్పు చేశారో ప్రపంచానికి చాటి చెప్పాడు. 66 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్స్‌తో 62 రన్స్‌ చేసి అదరగొట్టాడు. దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు కానీ, లేకుంటే కచ్చితంగా సెంచరీ బాదేవాడు.  ఇలా ఒక వైపు సర్ఫరాజ్‌ టీమిండియాకు ఆడుతుంటే..  మరోవైపు అతని తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ టీమిండియా అండర్‌ 19లో దుమ్ములేపుతున్నాడు. ఇటీవల ముగిసిన అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో వరుస సెంచరీలతో అదరగొట్టాడు. అతను కూడా త్వరలోనే టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉంది.

ఇలా ఇద్దరు అన్నదమ్ములు..  క్రికెట్‌లో సత్తా నాటుతున్నారు. అయితే.. సర్ఫరాజ్‌ ఖాన్‌, ముషీర్‌ ఖాన్‌ ఈ స్థాయికి రావడం వెనుక వాళ్ల తండ్రి నౌషద్‌ ఖాన్‌ కష్టం ఎంతో ఉంది. ముంబైలోని పేద కుటుంబంలో పుట్టిన నౌషద్‌ ఖాన్‌.. స్కూల్‌ పిల్లలకు కోచింగ్‌ ఇస్తూ జీవినం సాగించేవాడు. వాళ్లతో పాటే తన ఇద్దరు కుమారులకు క్రికెట్‌ పాఠాలు చెప్పేవాడు. అయితే.. ముంబై మెట్రో ప్రాజెక్ట్‌లో భాగంగా నౌషద్‌ ఖాన్‌ కోచింగ్‌ ఇచ్చే గ్రౌండ్‌ పోయింది. అక్కడి నుంచి తన ఇద్దరు కొడుకులపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టాడు. ‘మేం ఎన్నో కష్టాలు చూశాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు కూడా మాకు మిత్రులైపోయారు. అయితే.. మా పిల్లలను ఎప్పుడూ ఖాళీ కడుపులతో పడుకోబెట్టలేదని, అలాంటప్పుడు వాళ్లు కనీసం వాళ్ల కలల కోసం అయినా కష్టపడాలి కదా’ అని నౌషద్‌ ఖాన్‌ అన్నారు.

సర్ఫరాజ్‌, ముషీర్‌లను గొప్ప క్రికెటర్లగా తీర్చిదిద్దేందుకు నౌషద్‌ ఖాన్‌.. తన టైమ్‌ మొత్తం వాళ్లకే కేటాయించే వాడు. అందుకోసం ఆయన కొంచెం కఠినంగా కూడా మారాల్సి వచ్చింది. వాళ్లిద్దరి టైమ్‌ టేబుల్‌, సోషల్‌ మీడియా వాడకం, ప్రాక్టీస్‌ ఇలా అన్నింటిలోనూ నౌషద్‌ ఎంతో పక్కాగా ఉండేవాడు. ఉదయం నిద్రలేచే సమయంలో అయితే మరింత కఠినంగా వ్యవహరించేవాడు. ముంబై లాంటి తీవ్ర పోటీ ఉండే టీమ్‌ నుంచి ఎదగాలంటే.. క్రికెట్‌పైనే పూర్తి ఫోకస్‌ ఉండేలా ఇద్దరు కొడుకులను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచేవాడు నౌషద్‌. కొన్ని సార్లు, వాళ్ల సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను ఆయనే హ్యాండిల్‌చేసేవాడు. ఇంటి ముందు 18 యార్డ్‌ల పిచ్‌ ఏర్పాటు చేసి, పిల్లలిద్దరితో ప్రాక్టీస్‌ చేయించే వాడు.. రోజు 400 నుంచి 500 బంతులు ఎదుర్కొనేలా చూసేవాడు. ఇలా ఇద్దరు కొడుకుల భవిష్యత్తు కోసం పరితపించిపోయాడు. ఆయన కష్టం ప్రతిఫలంగానే ఈ రోజు దేశం మొత్తం ఒక ఆటగాడు టీమిండియాకు ఆడుతుంటే సంతోష పడుతోంది.

Naushadh khan makes his sons super cricketers

తన ఇద్దరు కొడుకుల భవిష్యత్తులోనే తన భవిష్యత్తు చూసుకున్న నౌషద్‌ లాంటి తండ్రి దొరకడం నిజంగా సర్ఫరాజ్‌, ముషీర్‌ చేసుకున్న అదృష్టం. ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌లా.. రేపు ఈ ఖాన్‌ బ్రదర్స్‌ కూడా కలిసి టీమిండియాకు ఆడితే.. నౌషద్‌ ఖాన్‌ పుత్రోత్సాహంతో ఉప్పొ​ంగిపోవడం ఖాయం. అందుకు ఆయన వందశాతం అర్హుడే. కంటి నిద్ర మానేసి, తనకంటూ ప్రత్యేక లక్ష్యాలు ఏం లేకుండా, పిల్లలే జీవితంగా బతుకుతున్న నౌషద్‌ ఖాన్‌ కల త్వరలోనే ఫలించాలని కోరకుందాం. ఆయన కోరుకున్నట్లు తన ఇద్దరు కొడుకులు దేశం గర్వపడే క్రికెటర్లుగా మారాలని ఆశిద్దాం. మరి సర్ఫరాజ్‌, ముషీర్‌ కోసం నౌషద్‌ పడుతున్న కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.