iDreamPost
android-app
ios-app

Sanju Samson: ఒక్క ఇన్నింగ్స్ తో ధోని, కోహ్లీ సరసన శాంసన్! చారిత్రాత్మక రికార్డు..

  • Published Dec 22, 2023 | 3:21 PM Updated Updated Dec 23, 2023 | 11:36 AM

సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక్క ఇన్నింగ్స్ తో ధోని, విరాట్ కోహ్లీ సరసన చేరాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక్క ఇన్నింగ్స్ తో ధోని, విరాట్ కోహ్లీ సరసన చేరాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Sanju Samson: ఒక్క ఇన్నింగ్స్ తో ధోని, కోహ్లీ సరసన శాంసన్! చారిత్రాత్మక రికార్డు..

సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో సమష్టిగా రాణించిన భారత జట్టు 78 పరుగులతో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించి సిరీస్ చేజిక్కించుకుంది. ఇక ఈ మ్యాచ్ లో అద్భుత సెంచరీతో కదంతొక్కాడు స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్. 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 108 పరుగులు చేశాడు. ఇది శాంసన్ వన్డే కెరీర్ లో తొలి సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలోనే సంజూ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక్క ఇన్నింగ్స్ తో ధోని, విరాట్ కోహ్లీ సరసన చేరాడు శాంసన్. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సంజూ శాంసన్.. టీ20 వరల్డ్ కప్ ముందు సెలెక్టర్లు ఇచ్చిన లక్కీ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సూపర్ సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ 78 రన్స్ తేడాతో సఫారీ టీమ్ ను చిత్తు చేసి, సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా శాంసన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఘనతతో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ల సరసన చేరాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే? వన్డేల్లో కనీసం 500లకు పైగా రన్స్ చేసిన టీమిండియా క్రికెటర్లలో 50కు పైగా సగటుతో పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో సంజూ చోటు దక్కించుకున్నాడు.

Samson vs Dhoni, Kohli

కాగా.. ఈ రికార్డుతో పాటుగా మరో చరిత్రాత్మక రికార్డులో భాగమైయ్యాడు సంజూ. శాంసన్ ఈ సెంచరీ చేయడంతో ఈ సంవత్సరం టీమిండియా తరఫున 19 శతకాలు నమోదు అయ్యాయి. దీంతో ఓ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా టీమిండియా మూడోసారి చరిత్రను లిఖించుకుంది. ఈ లిస్ట్ లో తొలి అయిదు స్థానాల్లో టీమిండియానే మూడు స్థానాల్లో ఉండటం విశేషం. 2017లో 19 శతకాలు, ఈ ఏడాది కూడా 19 సెంచరీలు, 1998లో 18 సెంచరీలు చేశారు భారత ఆటగాళ్లు. ఇక ఈ లిస్ట్ లో నాలుగు, ఐదు ప్లేసుల్లో సౌతాఫ్రికా టీమ్ ఉంది. మరి సంజూ శాంసన్ సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.