Vinay Kola
Sanju Samson: సంజు శామ్సన్ ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన తండ్రి విశ్వనాథ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Sanju Samson: సంజు శామ్సన్ ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన తండ్రి విశ్వనాథ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Vinay Kola
IPL కి ఇండియాలో క్రేజ్ మామూలుగా ఉండదు. IPL అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఓ ఎమోషన్. అలాంటి IPL లో దుమ్ము దులిపి రఫ్ఫాడించిన ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో కచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు సంజూ శామ్సన్. ఇతగాడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎక్కువగా ఆడకపోయిన IPL లో తన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. IPL చూసే ప్రతి ఒక్కరకీ సంజు శామ్సన్ పరిచయం అక్కరలేని పేరు. కేవలం IPL తోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులర్ అయిన క్రికెటర్ గా సంజు శాంసన్ నిలిచాడు అంటే అతిశయోక్తి కాదు. మంచి వికెట్ కీపర్ గా గుర్తింపు తెచ్చుకున్న సంజూ శాంసన్ రూటే సెపరేట్ అని చెప్పాలి. అతని ఆటలో ఓ స్టైల్ ఉంటుంది. చాలా విలువైన ఆటగాడు. రీసెంట్ గా టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్ వరుస సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు సంజూ శాంసన్.. సౌతాఫ్రికా టూర్ లోనూ అదే జోష్ కంటిన్యూ చేశాడు. ఫస్ట్ టీ20లో సూపర్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా సంజు శాంసన్ గురించి అతని తండ్రి విశ్వనాధ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సంజు ఎప్పుడూ కూడా రికార్డుల కోసం ఆడడని అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ అన్నారు. కొందరు మాత్రం తమ స్వార్థం కోసం, జట్టులో చోటు కోసం ఆడుతారు.. కానీ తన కొడుకు మాత్రం అలా కాదని ఆయన తెలిపారు. టీం ఇండియా స్టార్ ప్లేయర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అవకశాలు ఇవ్వలేదన్నారు. తన బిడ్డ 10 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. కానీ వారి వల్ల సంజూ శాంసన్ మరింత రాటుదేలాడని అన్నారు. “తమిళనాడు మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ సంజూ గురించి దారుణంగా మాట్లాడాడు. అతడు ఏం ఆడాడో నాకు తెలియదు. కానీ సంజూ గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడటం లేదు. తన మాటలతో నా కొడుకుని తీవ్రంగా బాధపెట్టాడు. సంజూ శాంసన్ బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడాన్ని శ్రీకాంత్ ఎగతాళి చేశాడు. ఏ టీం మీద చేసినా సెంచరీ సెంచరీనే. సచిన్, ద్రవిడ్‌లా సంజూకు సూపర్ క్లాసికల్ టచ్ ఉంది. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ కనీస మర్యాద ఇవ్వకుంటే ఎలా?” అని అన్నారు.
తన కొడుకు టాలెంట్ ని గుర్తించి అవకాశం ఇచ్చింది మాత్రం గంభీర్, సూర్యకుమార్ యాదవ్‌లే అని, అందుకు వారికి విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపాడు. “ఈ ఇద్దరూ టీ20 టీంలో లేకుంటే సంజూ శాంసన్‌ను మళ్లీ పక్కనపెట్టేవారు. నా కొడుకు కొట్టిన సెంచరీ ఈ ఇద్దరికీ అంకితమివ్వాలనుకుంటున్నాను. సంజూ వరుస సెంచరీలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి.ఇన్నాళ్ళు తనకు సరైన అవకాశాలు దక్కలేదు. ఇక నుంచి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలి.” అని అన్నారు. ప్రస్తుతం విశ్వనాధ్ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఆయన చేసిన ఈ కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.