Kumar Sangakkara: సంగక్కర చేతిలోని ఈ బ్యాట్ ఓ టీమిండియా స్టార్​ది.. గుర్తుపట్టండి చూద్దాం..!

శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కరకు భారత్​తో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఆయనకు లంకతో పాటు ఇక్కడ కూడా భారీగా అభిమానులు ఉన్నారు.

శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కరకు భారత్​తో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఆయనకు లంకతో పాటు ఇక్కడ కూడా భారీగా అభిమానులు ఉన్నారు.

శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కరకు భారత క్రికెట్​తో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఆయనకు లంకతో పాటు ఇక్కడ కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఈ లెఫ్టాండ్ బ్యాటర్​ సొగసైన ఆటకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. కీపర్​గా, బ్యాటర్​గా ఆయన అభిమానుల మనసుల్లో వేసిన ముద్ర అలాంటిది. సనత్ జయసూర్య, మార్వన్ ఆటపట్టు, జయవర్దనే, మురళీధరన్, చమిందా వాస్ వంటి దిగ్గజాలతో కలసి లంకను మోస్ట్ డేంజరస్​గా టీమ్​గా మార్చాడు సంగక్కర. ఎన్నో మ్యాచుల్లో ఒంటిచేత్తో జట్టును ఒడ్డున పడేశాడీ ఎడమ చేతి బ్యాటర్. వరల్డ్ బెస్ట్ కీపర్స్ లిస్ట్​లో పైవరుసలో ఉంటాడాయన. అలాంటోడు రిటైర్మెంట్ తర్వాత క్రమంగా కోచింగ్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో రాజస్థాన్ రాయల్స్​కు హెడ్​ కోచ్​గా వ్యవహరిస్తున్నాడు సంగర్కర. అలాగే ఆ టీమ్​కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్​గా ఉన్నాడు. జట్టు గెలుపోటములు, ఆటగాళ్ల ఎంపిక, యువకులను సానబెట్టడం.. ఇలా రాజస్థాన్ రాయల్స్​కు సంబంధించిన అన్ని విషయాలు ఆయనే చూసుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెటర్​గానే గాక ఐపీఎల్​లో ఆడటం ద్వారా, ఇప్పుడు లీగ్​లో కోచ్​గానూ ఇక్కడి అభిమానులకు ఆయన మరింత చేరువయ్యాడు. అలాంటి సంగక్కర తాజాగా బ్యాట్ పట్టి ఓ మ్యాచ్​ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఏయే జట్ల మధ్య జరిగింది? అనే వివరాలు తెలియరాలేదు. కానీ ఇందులో సంగక్కర వాడిన బ్యాట్ గురించి మాత్రం డిస్కషన్ నడుస్తోంది. దీనికి కారణం అది ఓ భారత స్టార్​ది కావడమే.

టీమిండియా స్టార్ బ్యాట్స్​మన్ సంజూ శాంసన్ బ్యాట్​తో సంగక్కర ఆడుతూ కనిపించాడు. ఓ మ్యాచ్​లో ఆయన ఆ బ్యాట్​ను వాడిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది తన బ్యాటేనని సంజూ తెలిపాడు. ‘సంగక్కర నా బ్యాట్లు వాడుతున్నాడు. ఇది నా డ్రీమ్’ అని శాంసన్ ఇన్​స్టాగ్రామ్​లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో సంగక్కర ఆ బ్యాట్​తో ఆడుతున్న ఫొటోను షేర్ చేశాడు. రాజస్థాన్ కెప్టెన్​గా ఉన్న సంజూతో సంగక్కరకు మంచి బాండింగ్ ఉంది. సంగక్కర ప్రోత్సాహంతో కెప్టెన్​గా డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటూ టీమ్​ను నడిపిస్తున్నాడు సంజూ. అతడి బ్యాటింగ్​ లోపాల్ని సరిదిద్ది తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేలా చేశాడు సంగక్కర. స్వయంగా గ్రేట్ బ్యాటర్ అయిన సంగక్కర, తన జట్టుకు కోచ్ కూడా అవడంతో ఆయన తన బ్యాట్ వాడేసరికి సంజూ ఆనందం పట్టలేకపోయాడు. లంక లెజెండ్ తన బ్యాట్ వాడటం ఓ కల అంటూ సంజూ పోస్ట్ పెట్టాడు.

Show comments