iDreamPost
android-app
ios-app

విరాట్ కోహ్లీ దానికి అనర్హుడు.. విలన్ కావాల్సింది, కానీ..: మాజీ క్రికెటర్

  • Published Jul 02, 2024 | 8:19 AM Updated Updated Jul 02, 2024 | 8:19 AM

Sanjay Manjrekar comments on Virat Kohli: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విలన్ కావాల్సింది.. కానీ వారి వల్లే బతికిపోయాడని మాజీ క్రికెటర్ కామెంట్ చేశాడు. పైగా దానికి అతడు అనర్హుడని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Sanjay Manjrekar comments on Virat Kohli: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విలన్ కావాల్సింది.. కానీ వారి వల్లే బతికిపోయాడని మాజీ క్రికెటర్ కామెంట్ చేశాడు. పైగా దానికి అతడు అనర్హుడని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

విరాట్ కోహ్లీ దానికి అనర్హుడు.. విలన్ కావాల్సింది, కానీ..: మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్ ను సగర్వంగా ముద్దాడిన టీమిండియా.. వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచింది. ఇక ఈ మెగాటోర్నీలో భారత జట్టు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్లు అద్భుతంగా రాణించారు, ఒక్క ప్లేయర్ తప్ప.. అతడే విరాట్ కోహ్లీ. ఈ ప్రపంచ కప్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, లీగ్, సూపర్ 8, సెమీ ఫైనల్లో దారుణంగా విఫలం అయ్యాడు.  అయితే కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో మాత్రం అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు టైటిల్ ను అందించాడు. ఫైనల్ మ్యాచ్ లో 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతోపాటుగా ప్లేయర్ ఆఫ్ ది అవార్డును సైతం అందుకున్నాడు. అయితే ఈ అవార్డుకు కోహ్లీ అనర్హుడని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఇవ్వడాన్ని తప్పుబట్టాడు టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. అసలు ఈ అవార్డుకు విరాట్ అనర్హుడని ఊహించని కామెంట్స్ చేశాడు. కోహ్లీ స్లో బ్యాటింగ్ కారణంగానే మ్యాచ్ ఉత్కంఠగా మారిందని విమర్శించాడు. ఒకవేళ ఫైనల్లో టీమిండియా ఓడిపోయి ఉంటే.. విరాట్ విమర్శలు ఎదుర్కొవడమే కాక.. విలన్ అయ్యేవాడని పేర్కొన్నాడు. ఇంకా ఏమన్నాడంటే?

“ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ బాగుంది. కానీ విరాట్ కోహ్లీ స్లో బ్యాటింగ్ వల్లే మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కోహ్లీ జిడ్డు బ్యాటింగ్ వల్ల హార్దిక్ పాండ్యా లాంటి బిగ్ హిట్టర్లు తక్కువ బంతులు ఆడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్ గనక ఓడిపోయి ఉంటే.. విరాట్ విమర్శలపాలు అవ్వడమే కాకుండా విలన్ గా మారేవాడు. కోహ్లీని బౌలర్లే కాపాడారు. నా అభిప్రాయం ప్రకారం అతడు ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ కు అనర్హుడు. ఈ అవార్డ్ ను బౌలర్లకు ఇవ్వాల్సింది. ఎందుకంటే? మ్యాచ్ ను వాళ్లే గెలిపించారు” అంటూ ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేశాడు సంజయ్ మంజ్రేకర్. మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కు కోహ్లీ అనర్హుడు అన్న మంజేక్రర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.