iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి స్పందించిన రోహిత్! ఏమన్నాడంటే?

  • Published Jul 02, 2024 | 7:35 AM Updated Updated Jul 02, 2024 | 7:35 AM

టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి తన రిటైర్మెంట్ పై స్పందించాడు. హిట్ మ్యాన్ ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి తన రిటైర్మెంట్ పై స్పందించాడు. హిట్ మ్యాన్ ఏమన్నాడంటే?

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి స్పందించిన రోహిత్! ఏమన్నాడంటే?

టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా సొంతం చేసుకోవడంతో.. ప్రపంచ వ్యాప్తంగా జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక తన అద్భుమైన కెప్టెన్సీతో భారత్ కు 13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ను అందించాడు రోహిత్ శర్మ. అయితే టీ20లకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన కొద్దిసేపటికే తాను కూడా ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతున్నాను అంటూ ప్రకటించి..  అందరికి షాకిచ్చాడు హిట్ మ్యాన్. ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక తన రిటైర్మెంట్ పై తొలిసారి స్పందించాడు హిట్ మ్యాన్. వీడ్కోలుపై ఏమన్నాడంటే?

టీ20 ప్రపంచ కప్ టీమిండియా గెలవడంతో 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని, 13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్నట్లు అయ్యింది. ముగిసిన ఈ మెగాటోర్నీలో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ ను ముద్దాడి.. సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇక ప్రపంచ కప్ గెలవడంతో.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు గుడ్ బై చెప్పారు. యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం కోసం తాను తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. మరోవైపు రోహిత్ శర్మ తనకు రిటైర్మెంట్ ఆలోచనే లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని తాజాగా వెల్లడించాడు.

rohit emotional words about his retirement

రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ మాట్లాడుతూ..”టీ20 వరల్డ్ కప్ గెలిచినా.. నాకు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనే లేదు. కానీ.. పరిస్థితుల వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పైగా వీడ్కోలు పలకడానికి ఇంతకు మించిన మంచి సమయం లేదనిపించింది. గుడ్ బై చెప్పడానికి వరల్డ్ కప్ గెలిచిన గొప్ప సందర్భం కంటే ఏముంటుంది? అందుకే ఈ రిటైర్మెంట్ ప్రకటించాను. టీ20లకు దూరమైనా.. ఐపీఎల్ ఆడతాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పొట్టి ఫార్మాట్ లో ఆడటాన్ని ఎంతో ఆస్వాదించానని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. ప్రపంచ కప్ గెలవాలి అనుకున్నాను.. గెలిచాను.. ఇదికూడా రిటైర్మెంట్ ప్రకటించడానికి ఓ కారణంగా చెప్పుకొచ్చాడు.