Nidhan
Sanath Jayasuriya, SL vs NZ: ఒకప్పుడు వరల్డ్ క్రికెట్‌ను శాసించిన శ్రీలంక.. క్రమంగా పసికూన రేంజ్‌కు పడిపోయింది. చెత్త పెర్ఫార్మెన్స్తో సొంత అభిమానుల నుంచి కూడా విమర్శలపాలైంది. అయితే ఆ టీమ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
Sanath Jayasuriya, SL vs NZ: ఒకప్పుడు వరల్డ్ క్రికెట్‌ను శాసించిన శ్రీలంక.. క్రమంగా పసికూన రేంజ్‌కు పడిపోయింది. చెత్త పెర్ఫార్మెన్స్తో సొంత అభిమానుల నుంచి కూడా విమర్శలపాలైంది. అయితే ఆ టీమ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
Nidhan
ఒకప్పుడు వరల్డ్ క్రికెట్‌ను శాసించింది శ్రీలంక. చిన్న దేశమే అయినా క్రికెట్లో మాత్రం బిగ్ టీమ్‌గా హవా నడిపించింది. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా.. ఇలా అన్ని ఇతర బడా జట్లను వణికించింది. మురళీధరన్, దిల్షాన్, సంగక్కర, జయవర్దనే, చమిందా వాస్, మలింగ లాంటి ఆటగాళ్లతో కూడిన టీమ్ అన్ని ఫార్మాట్లలోనూ డేంజరస్ ఎలెవన్‌గా పేరు తెచ్చుకుంది. ఐసీసీ టోర్నీల్లో కనీసం సెమీస్ లేదా ఫైనల్స్‌కు చేరుకుంటూ ఆధిపత్యం చలాయించింది. ఈ క్రమంలో కొన్ని బిగ్ ట్రోఫీస్ కూడా ఎగరేసుకుపోయింది. అయితే పైన చెప్పిన లెజెండ్స్ రిటైర్మెంట్తో దిక్కుతోచని స్థితిలోకి పడిపోయింది లంక టీమ్. వరుస వైఫల్యాలతో ఇంటా బయట విమర్శల పాలైంది. వరల్డ్ కప్స్‌లో లీగ్ దశకే పరిమితమవుతూ పసికూన కంటే దారుణమైన ఆటతీరుతో ట్రోలింగ్‌కు గురైంది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఒక యోధుడు లంక రాత మార్చేశాడు. అతడే జయసూర్య.
చెత్తాటతో దారుణంగా విమర్శలపాలవుతున్న లంక జట్టులో తక్కువ గ్యాప్‌లో భారీ మార్పు వచ్చేసింది. స్వల్ప వ్యవధిలో ఆ టీమ్ అనూహ్య విజయాలు సాధించింది. పసికూనగా ఉన్న ఆ జట్టును బెబ్బులిలా మార్చాడు తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య. అతడి గైడెన్స్‌లో రీసెంట్గా టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో నెగ్గిన లంక.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ను వాళ్ల సొంతగడ్డపై టెస్టుల్లో ఓడించింది. సిరీస్ పోయినా ఆఖరి టెస్టులో ఇంగ్లీష్ టీమ్‌ను మట్టికరిపించింది. ఇప్పుడు న్యూజిలాండ్‌ను కూడా టెస్టుల్లో ఓడించింది. భారత్‌పై సిరీస్ గెలుపు గాలివాటం అని తీసిపారేసినా.. ఇంగ్లండ్‌ను వాళ్ల సొంతగడ్డపై ఓడించడం మామూలు విషయం కాదు. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ లాంటి తోపు ప్లేయర్లు ఉన్న కివీస్‌ను లాంగ్ ఫార్మాట్లో చిత్తు చేయడం బిగ్ అఛీవ్మెంట్ అనే చెప్పాలి.
లంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో బిజీగా ఉన్న జయసూర్య ఆ జట్టు కోచింగ్ బృందంలోకి రావడంతో మొత్తం మారిపోయింది. ఓడితే కొత్తగా పోవడానికేమీ లేదు.. అదే గెలిస్తే మళ్లీ గౌరవం, పేరు ప్రతిష్టలు వస్తాయని టీమ్‌లో కసి పెంచాడు జయసూర్య. ప్రతి ప్లేయర్ నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టాడు. వాళ్లను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ అండగా నిలబడ్డాడు. ఫెయిల్ అయినా ప్లేస్ పక్కా అనే ధీమా కల్పించాడు. పతుమ్ నిస్సంక, మిలాన్ రత్ననాయకే, లాహిరు కుమార లాంటి యంగ్‌స్టర్స్‌కు వరుస ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. టీమ్‌కు ఫియల్‌లెస్ అప్రోచ్ అలవాటు చేశాడు. పాజిటివ్ ఇంటెంట్‌తో ఆడేలా ప్రోత్సహించాడు.
గెలుపోటములు కాదు.. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే ముఖ్యమని గ్రహించేలా చేశాడు కోచ్ జయసూర్య. అతడి కోచింగ్, గైడెన్స్ వల్లే బడా టీమ్స్‌పై కూడా లంక అద్భుత విజయాలు సాధిస్తోంది. వరుస సక్సెస్‌లు వస్తున్నాయి. ఇదే కాన్ఫిడెన్స్‌తో భవిష్యత్తులో జట్టు మరింత బాగా ఆడే అవకాశం ఉంది. టీమ్ అన్ని విభాగాల్లో సెట్ అవుతోంది. కాబట్టి ఫ్యూచర్లో అది మరింత స్ట్రాంగ్, పవర్ఫుల్ ఎలెవన్‌గా మారే అవకాశం ఉంది. ఒకప్పుడు క్రికెట్‌ను ఏలిన లంక.. మళ్లీ పునర్వైభవం దిశగా గట్టిగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. ఆ టీమ్ ఆటపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అద్భుతంగా ఆడుతోందని.. ఇలాగే ఆడుతూ పోతే డేంజరస్ టీమ్‌గా మారడం ఖాయమని చెబుతున్నారు. క్రెడిట్ ప్లేయర్లతో పాటు జయసూర్యకు ఇవ్వాలని చెబుతున్నారు. అతడు రియల్ టైగర్ అని మెచ్చుకుంటున్నారు. మరి.. లంక టీమ్ సక్సెస్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
– Won the ODI series vs IND.
– Won the 3rd Test vs ENG in ENG.
– Won the 1st Test vs NZ.SRI LANKA IS MAKING HUGE RETURN TO INTERNATIONAL CRICKET 🫡👌 pic.twitter.com/LrVmhNPthg
— Johns. (@CricCrazyJohns) September 23, 2024