iDreamPost
android-app
ios-app

SRH విజయాల వెనుక ఆ స్టార్ హీరోయిన్! అజ్ఞాత వ్యక్తిగా గ్రౌండ్ లోకి వస్తూ!

  • Published May 25, 2024 | 4:15 PM Updated Updated May 25, 2024 | 4:15 PM

Samyuktha Menon, SRH, IPL 2024: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓ శక్తి స్టేడియంలో ఉండి నడిపిస్తోంది. ఆ శక్తి ఓ స్టార్‌ హీరోయిన్‌ అంటున్నారు ఫ్యాన్స్‌. మరి ఆ హీరోయిన్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Samyuktha Menon, SRH, IPL 2024: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓ శక్తి స్టేడియంలో ఉండి నడిపిస్తోంది. ఆ శక్తి ఓ స్టార్‌ హీరోయిన్‌ అంటున్నారు ఫ్యాన్స్‌. మరి ఆ హీరోయిన్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 25, 2024 | 4:15 PMUpdated May 25, 2024 | 4:15 PM
SRH విజయాల వెనుక ఆ స్టార్ హీరోయిన్! అజ్ఞాత వ్యక్తిగా గ్రౌండ్ లోకి వస్తూ!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో తెలుగు క్రికెట్‌ అభిమానులంతా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మన హోం టీమ్‌ ఫైనల్స్‌కు వెళ్లింది.. ఇక కప్పు కొట్టడం ఒక్కటే మిగిలి ఉందంటూ.. సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతున్నారు. వాట్సాప్‌ స్టేటస్‌లు పెడుతూ.. హల్చల్‌ చేస్తున్నారు. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన తర్వాత.. క్వాలిఫైయర్‌-1లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో తలపడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ, తమకు ఉన్న రెండో అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్‌ చేసుకోలేదు. శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స​్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-2లో ఎస్‌ఆర్‌హెచ్‌ తమ సత్తా ఏంటో చాటి ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. సన్‌రైజర్స్‌ విజయాల వెనుక ఓ స్టార్‌ హీరోయిన్‌ ఉందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఆమె వల్లే సన్‌రైజర్స్‌ గెలుస్తుందని అంటున్నారు. మరి ఆ లక్కీ గల్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఈ మధ్య కాలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే మ్యాచ్‌లకు ఓనర్‌ కావ్య మారన్‌ కాకుండా మరో బ్యూటీ కూడా స్టేడియానికి వచ్చి సపోర్ట్‌ చేస్తోంది. పైగా అందరిలా ఏ వీవీఐపీ గ్యాలెరీలో కూర్చోని మ్యాచ్‌ చూడకుండా.. సాధారణ ప్రేక్షకులతో కలిసిపోయి.. హంగామా చేస్తూ.. ఆరెంజ్‌ ఆర్మీని సపోర్ట్‌ చేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరిని అనుకుంటున్నారా.. విరూపాక్ష సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో భయపెట్టి, మాస్టర్‌ సినిమాతో మరింత దగ్గరైన మలయాళ కుట్టి సంయుక్త మీనన్‌. కేరళకు చెందిన ఈ అమ్మడు.. తెలుగు ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తూ.. స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. ఇదే టైమ్‌లో తెలుగు వారి సొంత టీమ్‌ సన్‌రైజర్స్‌కు తన మద్దతు ఎంతో గ్రాండ్‌గా తెలుపుతోంది సంయుక్త.

Samyukthamenon

ఇటీవల సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరకముందు స్టేడియానికి వచ్చి చీర్‌ చేసింది. అంతే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్లే ఆఫ్స్‌కు బెర్త్‌ కన్ఫామ్‌ అయింది. తాజాగా శుక్రవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌కు కూడా వచ్చిన సంయుక్త.. మరోసారి తన స్టైల్లో సన్‌రైజర్స్‌ను సపోర్ట్‌ చేసింది. ఈ సారి ఏకంగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది ఎస్‌ఆర్‌హెచ్‌. ఇదంతా సంయుక్త మీనన్‌ సపోర్ట్‌ పుణ్యమే అంటూ క్రికెట్‌ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనా.. ఒక స్టార్‌ హీరోయిన్‌.. సాధారణ ప్రేక్షకులతో కలిసి పోయి.. మ్యాచ్‌ చూస్తూ.. తనకు అన్నం​ పెట్టే ఇండస్ట్రీ ఉన్న రాష్ట్రానికి చెందిన టీమ్‌కు ఈ రేంజ్‌లో సపోర్ట్‌ ఇవ్వడంపై తెలుగు ఫ్యాన్స్‌ అవుతున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌కు తప్పకుండా రావాలని కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişbahis siteleri