ఆ ముగ్గురు లేకుంటే టీమిండియా బంగ్లాదేశ్ కంటే బలహీనం: పాక్ మాజీ కెప్టెన్

  • Author Soma Sekhar Published - 07:17 PM, Fri - 11 August 23
  • Author Soma Sekhar Published - 07:17 PM, Fri - 11 August 23
ఆ ముగ్గురు లేకుంటే టీమిండియా బంగ్లాదేశ్ కంటే బలహీనం: పాక్ మాజీ కెప్టెన్

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్.. అదే ఊపులో టీ20 సిరీస్ ను కూడా గెలుచుకోవాలనుకుంది. కానీ అనూహ్యంగా పుంజుకున్న విండీస్ వరుసగా తొలి రెండు టీ20 మ్యాచ్ లను గెలుచుకుంది. అయితే మూడో టీ20లో గెలిచి సిరీస్ లో నిలిచింది టీమిండియా. కాగా.. శనివారం ఫ్లోరిడా వేదికగా కీలకమైన నాలుగో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలోనే విండీస్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై విమర్శలు గుప్పించాడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా.. పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాలో ఆ ముగ్గురు లేకుంటే జట్టు బంగ్లాదేశ్ కంటే బలహీనం అంటూ కామెంట్స్ చేశాడు.

పాకిస్థాన్ ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు టీమిండియా ప్లేయర్లపై మాటల దాడి చేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీయాలని వారి ఆలోచన. కాగా.. విండీస్ పర్యటనలో ముగ్గురు సీనియర్లు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా దారుణంగా విఫలం అవుతోందని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానల్ లో టీమిండియా ప్రదర్శనపై మాట్లాడాడు. సల్మాన్ భట్ మాట్లాడుతూ..”టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుంటే జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ ముగ్గురు జట్టులో లేకపోవడంతో.. టీమిండియా ఆటతీరు బంగ్లాదేశ్ ను తలపిస్తోంది. ఇన్ని రోజులుగా భారత జట్టును కాపాడుకుంటూ వస్తోంది వీరి అనుభవమే. ఇక ఐపీఎల్ కారణంగా టీమిండియా యువ ప్లేయర్లతో మూడు జట్లను తయ్యారు చేయోచ్చు. కానీ విజయాలు మాత్రం అందుకోలేరు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు సల్మాన్ భట్.

కాగా.. టీమిండియాలో చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. కానీ ఒత్తిడిని అధిగమించడం యంగ్ ప్లేయర్లకు తెలీదని పాక్ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు. ఇక కోహ్లీ, రోహిత్ శర్మ కూడా సచిన్, యువరాజ్, సెహ్వాగ్, గంభీర్, ధోనీ లాంటి సీనియర్లతో చాలా కాలం ఆడిన తర్వాత స్టార్ ప్లేయర్స్ గా మారారనే విషయం గుర్తుంచుకోవాలని అతడు సూచించాడు. అప్పుడే ఫ్యూచర్ టీమిండియా స్టార్లపై క్లారిటీ వస్తుందని సల్మాన్ భట్ చెప్పుకొచ్చాడు. మరి టీమిండియాలో ఆ ముగ్గురు లేకుంటే బంగ్లాదేశ్ కంటే బలహీనంగా టీమిండియా జట్టు కనిపిస్తోంది అన్న పాక్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: విండీస్ తో నాలుగో టీ20.. గిల్ పై వేటు! విధ్వంసకర ప్లేయర్ కు మరో ఛాన్స్..

Show comments