iDreamPost

Sai Sudharsan: వీడియో: సూపర్‌ క్యాచ్‌తో అదరగొట్టిన సాయి సుదర్శన్‌! ఏం పట్టాడు భయ్యా..

  • Published Dec 22, 2023 | 11:34 AMUpdated Dec 22, 2023 | 11:34 AM

సౌతాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ సాయి సుదర్శన్‌ అందుకున్న ఓ క్యాచ్‌ ఆ మ్యాచ్‌కే కాదు మొత్తం సిరీస్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆ క్యాచ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సౌతాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ సాయి సుదర్శన్‌ అందుకున్న ఓ క్యాచ్‌ ఆ మ్యాచ్‌కే కాదు మొత్తం సిరీస్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆ క్యాచ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 22, 2023 | 11:34 AMUpdated Dec 22, 2023 | 11:34 AM
Sai Sudharsan: వీడియో: సూపర్‌ క్యాచ్‌తో అదరగొట్టిన సాయి సుదర్శన్‌! ఏం పట్టాడు భయ్యా..

సౌతాఫ్రికా పర్యాటనలో టీమిండియా విజయయాత్ర కొనసాగుతోంది. పటిష్టమైన సఫారీ జట్టుతో వారి సొంతగడ్డపై మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసిన యంగ్‌ టీమిండియా.. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌ను ఏకంగా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. గురువారం పార్ల్‌లోని బోలాండ్ పార్క్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 78 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ సాయి సుదర్శన్‌ ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. అతను అందుకున్న క్యాచ్‌ మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ మాత్రమే కాదు.. క్యాచ్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచింది.

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో మూడో వన్డే సిరీస్‌ డిసైడర్‌గా మారింది. చివరిదైన మూడో వన్డే ఎవరు గెలిస్తే.. వాళ్లే సిరీస్‌. ఇలాంటి కీలక మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ ఒక్క క్యాచ్‌తో హైలెట్‌ అయిపోయాడు. అది కూడా సౌతాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ క్లాసెన్‌ క్యాచ్‌. మ్యాచ్‌లో ఎంతో కీలకమైన దశలో సాయి సుదర్శన్‌ ఆ క్యాచ్‌ అందుకున్నాడు. టీమిండియా యంగ్‌ పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 33వ ఓవర్‌ రెండో బంతిని క్లాసెన్‌ మిడాఫ్‌ దిశలో ఆడాడు. ఆ బంతిని గాల్లో పక్షిలా ఎగురుతూ.. ముందుకు డైవ్‌ చేస్తూ.. అదరిపోయే క్యాచ్‌ అందుకున్నాడు. ఆ క్యాచ్‌ చూసి.. టీమిండియా ఆటగాళ్లతో పాటు.. క్లాసెస్‌ సైతం షాక్‌ అయ్యాడు. సాయి అందుకున్న ఆ క్యాచ్‌తో క్లాసెన్‌ 21 పరుగుల ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. చాలా కాలంగా జట్టులో చోటు దక్కలేదని బాధపడుతున్న సంజు శాంసన్‌ ఈ మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 108 పరుగులు చేసి అదరగొట్టాడు. అలాగే తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ సైతం 77 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేశాడు. చివర్లలో ది ఫినిషర్‌ రింకూ సింగ్‌ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుతో 38 పరుగులు చేసి.. మంచి ఎండ్‌ అందించాడు. ఇక 297 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 218 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్‌ 4 వికెట్లతో చెలరేగాడు. అలాగే ఆవేశ్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముఖేష్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీశారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంతో పాటు.. సాయి సుదర్శన్‌ అందుకున్న క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి