iDreamPost
android-app
ios-app

సచిన్ పై పాక్ బౌలర్ సంచలన ఆరోపణలు! ఫిక్సింగ్ కంటే ఎక్కువే అంటూ..

  • Author Soma Sekhar Published - 05:21 PM, Mon - 3 July 23
  • Author Soma Sekhar Published - 05:21 PM, Mon - 3 July 23
సచిన్ పై పాక్ బౌలర్ సంచలన ఆరోపణలు! ఫిక్సింగ్ కంటే ఎక్కువే అంటూ..

సచిన్ టెండుల్కర్.. రెండు దశాబ్దాలకు పైగా తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లను అధిగమించాడు. తన ఓర్పుతో, నేర్పుతో ప్రత్యర్థులకు తన బ్యాట్ తోనే సమాధానాలు చెప్పేవాడు. ఇక సచిన్ కెరీర్ లో వివాదాలకు, గొడవలకు చోటే లేదు. కాగా.. తన బ్యాటింగ్ తోనే కాకుండా, తన వ్యక్తిత్వంతో కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. అలాంటి మచ్చలేని మనిషిపై తాజాగా ఓ పాక్ బౌలర్ సంచలన ఆరోపణలు చేశాడు. పాక్ మాజీ స్పిన్నర్ అయిన సయీద్ అజ్మల్ సచిన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అసలు విషయం ఏంటంటే? 2011 వరల్డ్ కప్ లో భాగంగా.. ఇండియా-పాక్ జట్లు మెుహాలీ వేదికగా సెమీఫైనల్లో తలపడ్డాయి.ఈ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ గా విక్టరీ సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్ లో సచిన్ టెండుల్కర్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. 89 పరుగులు చేసిన సచిన్.. భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో సచిన్ ముందుగానే అవుట్ అయ్యేవాడని, కానీ అతడిని కావాలనే నాటౌట్ గా అంపైర్లు ప్రకటించారని అజ్మల్ ఆరోపించాడు. ఈ సంఘటనను గుర్తు చేస్తూ.. అజ్మల్ మాట్లాడుతూ..

“2011 ప్రపంచ కప్ లో సచిన్ నా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయిన ఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. నా బౌలింగ్ లో సచిన్ అవుట్ అయ్యాడు. ఈ విషయం అంపైర్ కూడా తెలుసు. అయితే రిప్లేలో ఆ వీడియోను వారికి అనుగుణంగా కట్ చేసి, రెండు ఫ్రేమ్స్ ను బంతి వికెట్లను మిస్ అవుతున్నట్లుగా అందరిని మిస్ గైడ్ చేశారు. లేదంటే అది కచ్చితంగా వికెట్లను తాకేదే. సచిన్ టెక్నాలజీని వాడుకుని బతికిపోయాడు” అంటూ సంచలన ఆరోపణలు చేశాడు అజ్మల్. మరి దశాబ్ద కాలం తర్వాత అజ్మల్ ఇలాంటి ఆరోపణలు చేయడంతో.. టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అప్పుడు ఏం చేశావని, ఇన్నిరోజులకు నిద్రలేచావా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.