iDreamPost
android-app
ios-app

సచిన్ సింప్లిసిటీకి ఫిదా.. ఏం చేశాడో తెలుసా? వైరలవుతున్న వీడియో!

  • Published Feb 22, 2024 | 4:42 PM Updated Updated Feb 22, 2024 | 4:42 PM

Sachin Tendulkar: టీమిండియా దిగ్గజ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సచిన్ సింప్లిసిటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Sachin Tendulkar: టీమిండియా దిగ్గజ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సచిన్ సింప్లిసిటీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

  • Published Feb 22, 2024 | 4:42 PMUpdated Feb 22, 2024 | 4:42 PM
సచిన్ సింప్లిసిటీకి ఫిదా.. ఏం చేశాడో తెలుసా? వైరలవుతున్న వీడియో!

ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండటం అనేది కేవలం కొందరు మహానుభావులకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి వారిలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఒకడు. క్రికెట్ దేవుడిగా కీర్తించబడుతున్న సచిన్ తన కెరీర్ కు గుడ్ బై చెప్పి దశాబ్ద కాలం గడుస్తున్నా గానీ.. అతడికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ ప్రపంచంలో ఏ ప్లేస్ కు వెళ్లినా గానీ.. అభిమానులు చుట్టుముట్టి ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి ఎగబడుతూ ఉంటారు. వారికి అంతే రేంజ్ లో రెస్పెక్ట్ ఇస్తాడు మాస్టర్ బ్లాస్టర్. తాజాగా ఈ దిగ్గజ క్రికెటర్ చేసిన పనికి ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సచిన్ టెండుల్కర్.. వరల్డ్ క్రికెట్ కు దేవుడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి పదేళ్లు గడిచినా.. అతడికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. సచిన్ కనిపిస్తే చాలు అభిమానులు సంతోషంతో చుట్టుముట్టి ఫొటోల కోసం ఎగబడతారు. సచిన్ సైతం వారికి అంతే మర్యాద ఇస్తాడు. ఇక ఇటీవలే తన జెర్సీ నంబర్ 10 ధరించిన ఓ అభిమానికి ఊహించని సర్ఫ్రైజ్ ఇచ్చాడు సచిన్. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం చేశాడంటే? ఇటీవలే సచిన్ తన ఫ్యామిలీతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లాడు. దాంట్లో ఏముంది గొప్ప అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను.

సాధారణంగా సెలబ్రిటీలు అంటే విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకుని జర్నీ చేస్తారు. కానీ సచిన్ అలా చేయలేదు. సాధారణ పౌరుడిలా ఎకానమీ క్లాస్ లో ప్రయాణించి.. అందరిని ఫిదా చేశాడు. ఎకానమీ క్లాస్ లో సచిన్ ను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. చప్పట్లతో టీమిండియా దిగ్గజ క్రికెటర్ కు ఆహ్వానం పలికారు. సచిన్.. సచిన్ అంటూ విమానంలో కేరింతలు కొట్టారు. దీంతో ఫ్లైట్ కాస్త ఓ మినీ స్టేడియంలా మారిపోయింది. అందరికి థ్యాంక్స్ చెప్పిన సచిన్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. సచిన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు క్రికెట్ లవర్స్. ఇందుకే కదయ్యా.. నిన్ను క్రికెట్ దేవుడు అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కశ్మీర్ పర్యటనకు వెళ్లిన సచిన్ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాకుండా.. గల్లీలో యువకులతో క్రికెట్ సైతం ఆడాడు. మరి సచిన్ సింప్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL నుంచి షమీ అవుట్ … ఎందుకో తెలుసా?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet