iDreamPost

IPL నుంచి షమీ అవుట్ … ఎందుకో తెలుసా?

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే గుజరాత్ టైటాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ బౌలర్ ఈ సీజన్ కు అందుబాటులో లేకుండా పోయాడు.

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే గుజరాత్ టైటాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ బౌలర్ ఈ సీజన్ కు అందుబాటులో లేకుండా పోయాడు.

IPL  నుంచి షమీ అవుట్ … ఎందుకో తెలుసా?

ఐపీఎల్ 2024 సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని క్రికెట్ లవర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. ఐపీఎల్ ఛైర్మన్ మార్చి 22 నుంచి ప్రారంభం అవుతుందని హింట్ ఇచ్చాడు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తర్వాత మాత్రమే వస్తుంది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే గుజరాత్ టైటాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ బౌలర్ ఈ సీజన్ కు అందుబాటులో లేకుండా పోయాడు.

ఐపీఎల్ 17వ సీజన్ స్టార్ట్ కాకముందే.. గుజరాత్ టైటాన్స్ టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఐపీఎల్ 2024 సీజన్ కు దూరమైయ్యాడు. లెఫ్ట్ యాంకిల్ ఇంజ్యూరీతో బాధపడుతున్న అతడు.. ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ఈ గాయం కారణంగానే అతడు ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అయితే జనవరిలో లండన్ లో ఇంజెక్షన్లు తీసుకున్నప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆపరేషన్ కు యూకే వెళ్లనున్నాడు షమీ. దీంతో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కు పూర్తిగా దురం కానున్నాడు. ఇది గుజరాత్ జట్టుకు భారీ షాకనే చెప్పాలి.

కాగా.. ఇప్పటికే ట్రేడింగ్ విధానంతో ఆ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై టీమ్ కు వెళ్లిపోవడంతో.. ఆ జట్టు బలహీనపడింది. ఇక ఇప్పుడు షమీ కూడా గాయపడటంతో.. గుజరాత్ టీమ్ మరింత వీక్ గా తయ్యారైంది. గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోకపోవడంతో.. అతడు ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలగాల్సి వస్తోందని బీసీసీఐకి సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ 2023లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు మహ్మద్ షమీ. మరి ఐపీఎల్ 2024 సీజన్ కు స్టార్ బౌలర్ దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్! ధర ఎంతంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి