వినోద్‌ కాంబ్లీని ఆదుకోవాలంటూ సచిన్‌కు విన్నపాలు! సచినే ఎందుకు ఆదుకోవాలంటే..?

Sachin Tendulkar, Vinod Kambli: కనిసం నడవలేని దీన స్థితిలో ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీని సచిన్‌ ఆదుకోవాలనే రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. అయితే.. సచిన్‌ మాత్రమే ఎందుకు ఆదుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Sachin Tendulkar, Vinod Kambli: కనిసం నడవలేని దీన స్థితిలో ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీని సచిన్‌ ఆదుకోవాలనే రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. అయితే.. సచిన్‌ మాత్రమే ఎందుకు ఆదుకోవాలో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో వినోద్‌ కాంబ్లీ కనీసం నడవలేని దీన స్థితిలో కనిపించాడు. క్షణాల్లో ఆ వీడియో వైరల్‌గా మారింది. అయితే.. ఆ వీడియోలో ఉంది టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీనే అని కచ్చితంగా ఎవరు నిర్దారించలేదు. కానీ, చాలా మంది అతను కాంబ్లీని పేర్కొంటూ వీడియోను షేర్‌ చేశారు. అలాగే పలు జాతీయ మీడియా సంస్థలు కూడా వినోద్‌ కాంబ్లీ నడవలేని స్థితిలో ఉన్నారంటూ పేర్కొన్నాయి. ఈ వీడియో చూసిన కొంతమంది.. సచిన్‌ టెండూల్కర్‌కు ఒక రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

వినోద్‌ కాంబ్లీని సచిన్‌ టెండూల్కర్‌ ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. ట్విట్టర్‌లో సచిన్‌ను ట్యాగ్‌ చేస్తూ.. దయజేసి వినోద్‌ కాంబ్లి పరిస్థితి చూడండి సచిన్‌ సార్‌, ఆయనను ఆదుకోండి అంటూ కోరుతున్నారు. అయితే.. వినోద్‌ కాంబ్లి.. ఇంత దయనీయ స్థితిలో ఉంటే చాలా మంది నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు ఒక్క సచిన్‌ను మాత్రమే ఎందుకు హెల్ప్‌ అడుగుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. టీమిండియాకు సచిన్‌ టెండూల్కర్‌, వినోద్‌ కాంబ్లీ కలిసి ఆడారు. అంతకంటే ముఖ్యంగా వీళ్లిద్దరు బాల్య స్నేహితులు. ఇద్దరు కలిసే క్రికెట్‌ నేర్చుకున్నారు.

దిగ్గజ కోచ్‌.. రమాకాంత్‌ అచ్రేకర్‌ వద్ద కోచింగ్‌ తీసుకున్నారు. ఇద్దరు కలిసి దేశవాళి క్రికెట్‌లో ముంబైకి ఆడారు. ఎన్నో గొప్ప గొప్ప రికార్డులు కూడా నెలకొల్పారు. అలాగే సచిన్‌ టెండూల్కర్‌ 1989లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తే.. కాంబ్లి 1991లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ క్రికెట్టే ప్రాణంగా బతికారు. అయితే.. సచిన్‌ ఒక లెజెండ్‌గా ఎదిగితే.. కొన్ని చెడు అలవాట్లతో వినోద్‌ కాంబ్లి సాధారణ క్రికెటర్‌గా మిగిలిపోయాడు. టీమిండియా తరఫున 104 వన్డేలు, 17 టెస్టులు ఆడాడు కాంబ్లి. వన్డేల్లో 2477 పరుగులు సాధించాడు. అందులో 14 హాఫ్‌ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి.

అలాగే టెస్టుల్లో 1084 పరుగులు, 4 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు చేశాడు. మొత్తంగా ఒక దిగ్గజ క్రికెటర్‌ కావాల్సిన వ్యక్తి ఇలా దీన స్థితికి చేరుకున్నాడు. అయితే.. బాల్య స్నేహితుడు కావడం, ఎన్నో ఏళ్లు కలిసి ఆడటం, తన ప్రతి జర్నీలో ఉండటంతో.. వినోద్‌ కాంబ్లిని సచిన్‌ ఆదుకోవాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కాంబ్లిని ఆదుకోవడం సచిన్‌కు పెద్ద విషయం కాదని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే.. ఇండియాలోనే అత్యంత ధనవంత క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కరే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments