iDreamPost
android-app
ios-app

Sachin Tendulkar: సచిన్‌ టెండుల్కర్‌ సెక్యూరిటీ గార్డ్‌ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని

  • Published May 15, 2024 | 2:13 PMUpdated May 15, 2024 | 2:17 PM

సచిన్‌ టెండుల్కర్‌ గన్‌మెన్‌ ఒకరు.. దారుణానికి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే..

సచిన్‌ టెండుల్కర్‌ గన్‌మెన్‌ ఒకరు.. దారుణానికి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే..

  • Published May 15, 2024 | 2:13 PMUpdated May 15, 2024 | 2:17 PM
Sachin Tendulkar: సచిన్‌ టెండుల్కర్‌ సెక్యూరిటీ గార్డ్‌ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని

నేటి కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కొందరు ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా ప్రాణాలు తీసుకుంటుంటే.. మరి కొందరు మాత్రం చాలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈమధ్య కాలంలో ఇంటర్‌, టెన్త్‌ విద్యార్థులు ఎక్కువగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో దారుణాలకు ఒడిగట్టారు. మరికొందరైతే.. రిజల్ట్‌ రాకముందే.. ఫెయిల్‌ అవుతామనే భయంతో.. ప్రాణాలు తీసుకున్నారు. ముక్కపచ్చలారని చిన్నారులు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం సంచలనంగా మారింది. ఇక వయసులో పెద్దవారు, జీవితాన్ని కాచి వడబోసిన వారు.. జీవితంలో ఎలాంటి సమస్యలు లేని వారు సైతం.. ఆత్మహత్యలకు పాల్పడుతుండటం కలకలం రేపుతుంది. తాజాగా ఓ చోట దారుణం చోటు చేసుకుంది. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ గన్‌మెన్‌ ఒకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆ వివరాలు..

సచిన్‌ టెండుల్కర్‌ సెక్యూరిటీ గార్డ్‌, ఎస్‌ఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఒకరు దారుణ నిర్ణయం తీసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన వ్యక్తిని ప్రకాష్‌ కాప్డేగా గుర్తించారు. ఇతను కొన్ని రోజుల క్రితమే సెలవు మీద స్వస్థలం జమ్నేర్‌ పట్టణానికి వెళ్లాడు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో.. తన ఇంట్లో ప్రకాష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న సర్వీస్‌ రివాల్వర్‌ తీసుకుని.. మెడ వద్ద కాల్చుకుని చనిపోయాడు. అర్థరాత్రి అందరూ మంచి నిద్రలో ఉండటంతో.. ఎవరూ ప్రకాష్‌ను గమనించలేదు. తుపాకీ శబ్దం వినడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచారు. ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్లిన వారికి రక్తపు మడుగులో పడి ఉన్న ప్రకాష్‌ కనిపించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

ప్రకాష్‌కి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. తన వృద్ధ తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ప్రకాష్‌ ఇంటి వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్లే ప్రకాష్‌ ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకుని ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రకాష్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి