Somesekhar
టేపు చుట్టిన టెన్నిస్ బాల్స్ లో బ్యాటర్లను పరీక్షించాలని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టేపు చుట్టిన టెన్నిస్ బాల్స్ లో బ్యాటర్లను పరీక్షించాలని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ సందర్భాన్ని బట్టి ఇండియన్ క్రికెట్ కు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. మెరుగైన ఆటగాళ్లను దేశానికి అందించడానికి, వారిని స్టార్ క్రికెటర్లుగా తీర్చిదిద్దడానికి అవి ఉపయోగపడుతుంటాయి. 2025 జనవరిలో జరగబోయే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ISPL)లో ఓ పద్ధతిని అవలంభించి, బ్యాటర్లను పరీక్షించాలని చెప్పుకొచ్చాడు. బ్యాటర్లకు ప్రయోజనం కల్పిస్తున్నప్పుడు బౌలర్లకు కూడా ఆ అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ISPL).. 2025 జనవరి 26 నుంచి ఫిబ్రవరి 9 వరకు రెండో సీజన్ జరగనుంది. ఈ సీజన్ లో టేపు చుట్టిన టెన్నిస్ బంతితో రివర్స్ స్వింగ్ చేయడం ద్వారా బ్యాటర్లను టెస్ట్ చేయాలని సచిన్ సూచించాడు. సచిన్ మాట్లాడుతూ..”నేను క్రికెట్ ఆడే తొలి రోజుల్లో టెన్నిస్ బంతికి ఒకవైపు టేపు చుట్టేవాడిని, ఎందుకంటే? దానికి ఒకవైపు మెరుపు.. మరోవైపు గరుకుగా ఉంటుంది. కాబట్టి టెన్నిస్ బాల్ కు టేపు చుట్టి ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఈ పద్ధతిని ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు? బ్యాటర్లకు ప్రయోజనం కల్పిస్తున్నప్పుడు, బౌలర్లకు సైతం అవకాశం ఇవ్వాలి. ఈ విధానాన్ని అమలు చేసి.. బ్యాటర్ల సత్తాను పరీక్షించవచ్చు” అని టీమిండియా దిగ్గజం పేర్కొన్నాడు. మరి సచిన్ సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.