iDreamPost
android-app
ios-app

అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై సచిన్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌!

  • Published Jan 22, 2024 | 6:50 PM Updated Updated Jan 22, 2024 | 6:50 PM

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతులు మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో సచిన్‌ టెండూల్కర్‌తో పాటుచాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచిన్‌ భావోద్వేగానికి గురయ్యారు.

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతులు మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో సచిన్‌ టెండూల్కర్‌తో పాటుచాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచిన్‌ భావోద్వేగానికి గురయ్యారు.

  • Published Jan 22, 2024 | 6:50 PMUpdated Jan 22, 2024 | 6:50 PM
అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై సచిన్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌!

కొన్ని కోట్ల మంది ఎన్నో ఏళ్లుగా కంటున్న కల.. నేటితో సకారమైంది. రామజన్మ భూమి అయ్యోధ్యలో ఆ రాయుడికి ఆలయం నిర్మించాలనే సంకల్పం మొత్తానికి నెరవేరింది. అయోధ్యలోని భవ్యమైన రామమందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహత్తర కార్యక్రమం బాల రాముడి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో అయోధ్య మొత్తం రామనామం మారుమోగింది. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయితే.. ఈ కార్యక్రమంలో అనేకమంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ రంగాల నుంచి అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

వారిలో టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఉన్నాడు. ఈ వేడుకలో పాల్గొనాలని సచిన్‌ టెండూల్కర్‌కు ఎప్పుడో ఆహ్వానం అందింది. సచిన్‌తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ‍ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ క్రికెటర్లు వెంకటేశ్‌ ప్రసాద్‌, అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీలకు కూడా బాల రాముడి ప్రాణప్రతిష్ఠలో పాల్గొనాలని ఆహ్వానాలు అందాయి. వీరిలో కుంబ్లే, వెంకటేశ్‌ ప్రసాద్‌, సచిన్‌ టెండూల్కర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాల రాముడి ప్రాణప్రతిష్ఠపై సచిన్‌ స్పందిస్తూ.. ఎన్నో ఏళ్ల కల నిజమైంది అంటూ దాదాపు కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు. సచిన్‌ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సచిన్‌కు మొదటి నుంచి వివపరీతమైన భక్తిశ్రద్ధలు ఉన్న విషయం తెలిసిందే. ఆయన దేవుడిని, దైవ శక్తిని బాగా నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందడంతోనే సచిన్‌ ఎంతో సంతోషించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి గురయ్యారు. మరి సచిన్‌ ఎమోషల్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.