Somesekhar
టీమిండియా ఓటమిపై స్పందిస్తూ.. ఆటగాళ్లపై ఊహించని కామెంట్స్ చేశాడు భారత దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. అదే టీమిండియా కొంపముంచిందని చెప్పుకొచ్చాడు.
టీమిండియా ఓటమిపై స్పందిస్తూ.. ఆటగాళ్లపై ఊహించని కామెంట్స్ చేశాడు భారత దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. అదే టీమిండియా కొంపముంచిందని చెప్పుకొచ్చాడు.
Somesekhar
సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో.. బాక్సింగ్ డే టెస్ట్ ముచ్చటగా మూడు రోజుల్లోనే ముగిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. తొలి పోరులో సఫారీ టీమ్ ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో అదరగొట్టింది. ఇక ఈ ఓటమితో భారత్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు క్రికెట్ లెజెండ్స్. ఈ లిస్ట్ లోకి తాజాగా వచ్చి చేరాడు భారత దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. టీమిండియా ఓటమిపై స్పందిస్తూ.. ఊహించని కామెంట్స్ చేశాడు. అదే టీమిండియా కొంపముంచిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా జట్టుపై ప్రశంసలు కురిపించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఓటమితో టీమిండియాపై హాట్ కామెంట్స్ చేశాడు దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండుల్కర్.”బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సౌతాఫ్రికా అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. అయితే తొలి ఇన్నింగ్స్ తర్వాత సఫారీ టీమ్ కొంచెం ఒత్తిడిలోకి వెళ్తుందని నేను భావించాను. కానీ అలా జరగలేదు. ప్రోటీస్ పేస్ దళం అంచనాలకు మించి రాణించింది. వారి సంచలన ప్రదర్శన కారణంగా టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు తమ చెత్త షాట్ సెలెక్షన్ తో వికెట్లు పారేసుకున్నారు. పరిస్థితులను అర్ధం చేసుకుని ఆడటంలో టీమిండియా ప్లేయర్లు పూర్తిగా విఫలం అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చెత్తగా ఆడారు” అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.
కాగా.. సచిన్ నుంచి ఇలాంటి కామెంట్స్ దాదాపు మనం గతంలో ఎన్నడూ వినలేదు. ఇక ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, డీన్ ఎల్గర్, జాన్సెస్, బెడింగ్ హామ్ అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు మాస్టర్ బ్లాస్టర్. వీరు మాత్రమే సిచ్యూవేషన్ ను అర్దం చేసుకుని బ్యాటింగ్ చేశారని తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు సచిన్. మరి టీమిండియా ఓటమిపై సచిన్ చేసిన కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Well played South Africa!
While I initially felt the South African team would’ve been unhappy after the 1st innings, their pace attack surpassed expectations and showcased remarkable skill in the 2nd innings, in spite of the pitch becoming more favourable for batting as the…
— Sachin Tendulkar (@sachin_rt) December 28, 2023