Nidhan
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అతడు ఇదే బాదుడు ఐపీఎల్‌లోనూ బాదితే మాత్రం ఈసారి కప్పు ఆర్సీబీదే.
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అతడు ఇదే బాదుడు ఐపీఎల్‌లోనూ బాదితే మాత్రం ఈసారి కప్పు ఆర్సీబీదే.
Nidhan
డుప్లెసిస్.. మాస్ హిట్టింగ్ చేయడంలో ఆరితేరిన ఆటగాడు. అలాగని అడ్డగోలు షాట్స్ కొట్టడు. బాల్‌ను పక్కాగా అంచనా వేసి దాని మెరిట్‌కు తగ్గట్లు ఏ షాట్ కొట్టాలనేది ఎంచుకొని రెప్పపాటులో బౌండరీకి తరలిస్తాడు. బౌండరీలతో పాటు భారీ సిక్సులతో చూస్తుండగానే పెను విధ్వంసం సృష్టించి మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లో నుంచి లాగేసుకుంటాడు. గేమ్‌ను సింగిల్ హ్యాండ్‌తో మార్చే సత్తా ఉంది కాబట్టే డుప్లెసిస్‌ను చూసి అపోజిషన్ టీమ్స్ భయపడతాయి. అతడ్ని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌కు పంపేందుకు ప్రయత్నిస్తాయి. కానీ మొండిఘటమైన డుప్లెసిస్ పట్టుదలతో బ్యాటింగ్ చేస్తూ తన జట్టు గెలిచేదాకా వదిలిపెట్టడు. తాజాగా ఇది మరోమారు ప్రూవ్ చేశాడు. ఎస్ఏ టీ20లో ఓ మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయిన డుప్లెసిస్.. తన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు.
ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ డుప్లెసిస్ (20 బంతుల్లో 50 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. 5 బౌండరీలు, 3 భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్ ల్యూస్ డు ప్లూయ్ (14 బంతుల్లో 41 నాటౌట్) కూడా ఉతికి ఆరేయడంతో జేఎస్కే జట్టు 5.4 ఓవర్లలోనే టార్గెట్‌ను రీచ్ అయింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్వహించిన ఈ మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. టాస్ నెగ్గిన ఎంఐ కేప్‌టౌన్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన జోబర్గ్ జట్టు 5.4 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను ఊది పారేసింది. ఆ టీమ్ ఓపెనర్లు ప్లూయ్, డుప్లెసిస్ ఊచకోత కోయడంతో లక్ష్యం చిన్నబోయింది. డుప్లెసిస్ అనుకుంటే అతడి స్ఫూర్తిగా ప్లూయ్ కూడా చెలరేగి బ్యాటింగ్ చేశాడు. వీళ్ల దూకుడు చూస్తుంటే మరో 40 పరుగులు ఉన్నా ఈజీగా ఛేజ్ చేసేవారని అనిపించింది.
డుప్లెసిస్ విధ్వంసక బ్యాటింగ్‌ను సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. కరెక్ట్ టైమ్‌కు అతడు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని అంటున్నారు. ఐపీఎల్ కొత్త సీజన్ మొదలవడానికి ముందు డుప్లెసిస్ ఫామ్‌ను అందుకోవడంతో ఆర్సీబీ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఎస్ఏ20లో ఆడిన ఆటనే క్యాష్ రిచ్ లీగ్‌లోనూ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఇదే బాదుడును ఐపీఎల్‌లోనూ బాదితే ఈసారి కప్ నమ్దే అని ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి తమ జట్టుకు తిరుగులేదని డుప్లెసిస్‌ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని అంటున్నారు. ఇక, ఇంటర్నేషనల్ క్రికెట్‌కు చాన్నాళ్లుగా దూరంగా ఉంటున్న డుప్లెసిస్ టీ20 వరల్డ్ కప్-2024లో తనకు ఆడాలని ఉందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతడ్ని ఆడించడం సౌతాఫ్రికా బోర్డు చేతుల్లోనే ఉంది. మరి.. డుప్లెసిస్ తిరిగి ఫామ్‌ను అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
JOBURG SUPER KINGS 98 RUNS FROM JUST 5.4 OVERS. 🤯
– Madness from Faf Du Plessis & Du Plooy…!!!!pic.twitter.com/M1t9aqaG0x
— Johns. (@CricCrazyJohns) January 30, 2024
WHAT A RUN CHASE JOBURG SUPER KINGS 🤯 🔥
JSK chases down 98 runs from just 5.4 overs – Faf Du Plessis 50*(20) & Du Plooy 41*(14) are the heroes in chase against MI Capetown in SA20 – A classic game. pic.twitter.com/XqKwrSU5Xs
— Johns. (@CricCrazyJohns) January 29, 2024