iDreamPost

సూపర్-8లో డికాక్ విధ్వంసం.. విండీస్ పిచ్​లపై ఎలా ఆడాలో చూపించాడు!

  • Published Jun 19, 2024 | 10:03 PMUpdated Jun 19, 2024 | 10:03 PM

అందరూ భయపడుతున్న కరీబియన్ పిచ్​లపై విధ్వంసక ఇన్నింగ్స్​తో చెలరేగాడు సౌతాఫ్రికా స్టార్ డికాక్. యూఎస్​ఏతో జరుగుతున్న సూపర్-8 పోరులో జూలు విదిల్చాడీ వెటరన్ బ్యాటర్.

అందరూ భయపడుతున్న కరీబియన్ పిచ్​లపై విధ్వంసక ఇన్నింగ్స్​తో చెలరేగాడు సౌతాఫ్రికా స్టార్ డికాక్. యూఎస్​ఏతో జరుగుతున్న సూపర్-8 పోరులో జూలు విదిల్చాడీ వెటరన్ బ్యాటర్.

  • Published Jun 19, 2024 | 10:03 PMUpdated Jun 19, 2024 | 10:03 PM
సూపర్-8లో డికాక్ విధ్వంసం.. విండీస్ పిచ్​లపై ఎలా ఆడాలో చూపించాడు!

టీ20 వరల్డ్ కప్-2024 కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ మ్యాచ్​లు ముగిసి.. సూపర్-8 మ్యాచ్​లు మొదలయ్యాయి. దీంతో అందరూ కరీబియన్ పిచ్​ల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి స్లో వికెట్ల మీద హిట్టింగ్ చేయడం కష్టం, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కట్టర్స్, స్లో బౌన్సర్స్​ను ఫేస్ చేస్తూ పరుగుల వరద పారించడం అసాధ్యమని అంటున్నారు. అయితే ఇదంతా ట్రాష్.. బ్యాటర్​కు దమ్ముంటే పరుగులు అవే వస్తాయని ప్రూవ్ చేశాడు సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్. అమెరికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్​లో విధ్వంసక బ్యాటింగ్​తో చెలరేగిపోయాడు డికాక్. స్లో, స్టడీగా ఆడితే పరుగులు వస్తాయన్న కరీబియన్ పిచ్​లపై హిట్టింగ్​ కూడా ఈజీ అని అతడు ప్రూవ్ చేశాడు.

యూఎస్​ఏతో మ్యాచ్​లో డికాక్ ఫస్ట్ బాల్​ నుంచే హిట్టింగ్​కు దిగాడు. 7 బౌండరీలు, 5 భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న ఈ ప్రొటీస్ ఓపెనర్ 74 పరుగులు చేశాడు. అతడికి తోడుగా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (32 బంతుల్లో 46) కూడా సూపర్బ్ నాక్​తో అలరించాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (16 బంతుల్లో 20 నాటౌట్) మెరుపు బ్యాటింగ్​తో టీమ్​కు భారీ స్కోరు అందించారు. వీళ్లందరూ రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది మార్క్రమ్ సేన. సౌతాఫ్రికా ఇన్నింగ్స్​లో డికాక్ బ్యాటింగ్ హైలైట్​గా నిలిచింది. అతడు మొదట్నుంచి విరుచుకుపడటంతో అమెరికా బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కూడా అదరగొట్టడంతో భారీ స్కోరు సాధ్యమైంది. మరి.. డికాక్ ఇన్నింగ్స్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి