Nidhan
జింబాబ్వే సిరీస్‌లో అదరగొడుతున్నాడు యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్. తన మీద టీమ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు.
జింబాబ్వే సిరీస్‌లో అదరగొడుతున్నాడు యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్. తన మీద టీమ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే జింబాబ్వే టూర్‌తో బిజీ అయిపోయింది టీమిండియా. శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని ఈ జట్టు నిండా యువ ఆటగాళ్లే ఉన్నారు. దీంతో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఐపీఎల్ స్టార్లు ఉండటంతో అదరగొడుతుందని అంతా భావించారు. కానీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య తొలి మ్యాచ్‌లో తుస్సుమంది మెన్ ఇన్ బ్లూ. 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకొని రెండో టీ20లో ఆతిథ్య జట్టును 100 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది గిల్ సేన. ఆ మ్యాచ్‌లో సెంచరీ హీరో అభిషేక్ శర్మతో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ సూపర్బ్ నాక్‌తో ఆకట్టుకున్నాడు. 47 బంతుల్లో 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాను భారీ స్కోరుకు చేర్చాడు రుతురాజ్. తొలుత అభిషేక్, ఆ తర్వాత రింకూ సింగ్‌తో కలసి భారీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు.
మూడో నంబర్లో ఆడిన రుతురాజ్ స్టార్టింగ్‌లో వికెట్‌ను కాపాకోవడం, స్ట్రయిక్ రొటేషన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అటు అభిషేక్ దంచి కొట్టడంతో అతడికి తోడుగా నిలబడ్డాడు. కానీ ఒక్కసారి అతడు ఔట్ అవగానే జూలు విదిల్చిన గైక్వాడ్.. బిగ్ షాట్స్‌తో జింబాబ్వే బౌలర్లను భయపెట్టాడు. ఎడాపెడా బౌండరీలు కొడుతూ పోయాడు. అతడి ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్ టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తున్నారు. అచ్చం కోహ్లీలా యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ, ఆఖర్లో భలేగా చెలరేగాడని మెచ్చుకుంటున్నారు. విరాట్‌లాగే థర్డ్ డౌన్లో దిగడం, అదే రీతిన ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించడం చూసి అతడికి సరైన వారసుడు రుతురాజ్ అని అంటున్నారు. అయితే దయచేసి అలా పోల్చొద్దని రిక్వెస్ట్ చేశాడు గైక్వాడ్.
‘కోహ్లీ భాయ్‌తో నన్ను కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైమ్‌లో నేనో మాట చెప్పా. ధోని భాయ్లా ఆడటం, కెప్టెన్‌గా ఆ స్థాయిని అందుకోవడం అంత ఈజీ కాదన్నా. ఏ క్రికెటర్ అయినా సరే తమ కెరీర్‌ను ప్రత్యేకంగా మొదలుపెట్టాలని కోరుకుంటారు. నేను కూడా అలాగే అనుకుంటున్నా. నాదైన ఆటతీరుతో పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నా. నేను దీనికే ప్రాధాన్యత ఇస్తా’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. థర్డ్ డౌన్లోనే బ్యాటింగ్ చేయాలని తానేమీ అనుకోవడం లేదన్నాడు గైక్వాడ్. టీమ్ అవసరాలను బట్టి ఏ పొజిషన్లో ఆడేందుకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఓపెనింగ్ స్థానానికి థర్డ్ డౌన్‌కు మధ్య పెద్ద తేడా ఏమీ లేదన్నాడు. ఏ స్థానంలో దిగినా కొత్త బాల్ ఛాలెంజ్‌ను ఎదుర్కోక తప్పదన్నాడు. మరి.. కోహ్లీతో తనను పోల్చొద్దంటూ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Ruturaj said “It isn’t right to think to compare with Virat bhai or even try to fill his shoes is relatively very tough & hard, as I said during IPL, it is difficult to fill Mahi bhai’s shoes. You want to start your own career, play your own game & that is the priority now”. pic.twitter.com/LtjvNFNXLI
— Johns. (@CricCrazyJohns) July 9, 2024