iDreamPost
android-app
ios-app

Rohit Sharma: ఆ టీమిండియా లెజెండ్ నాకు భార్య లాంటోడు.. రోహిత్ ఫన్నీ కామెంట్!

  • Published Jul 09, 2024 | 7:20 PM Updated Updated Jul 09, 2024 | 7:20 PM

టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆ లెజెండ్​ను తలచుకొని అతడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆ లెజెండ్​ను తలచుకొని అతడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Jul 09, 2024 | 7:20 PMUpdated Jul 09, 2024 | 7:20 PM
Rohit Sharma: ఆ టీమిండియా లెజెండ్ నాకు భార్య లాంటోడు.. రోహిత్ ఫన్నీ కామెంట్!

టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంతో భారత అభిమానులతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సంతోషంలో మునిగిపోయాడు. అందని ద్రాక్షగా ఉన్న ట్రోఫీ దరికి చేరడంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కప్పు గెలిచిన సంతోషంలో సహచర ప్లేయర్లను పట్టుకొని ఏడ్చేసిన హిట్​మ్యాన్.. మెగాటోర్నీ ముగిసి పది రోజులు అవుతున్నా ఇంకా సెలబ్రేషన్స్​లో బిజీగా ఉన్నాడు. కప్పుతో స్వదేశానికి తిరిగొచ్చాక జట్టు సభ్యులతో సహా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశాడతను. ఆ తర్వాత ముంబైలో నిర్వహించిన విక్టరీ పరేడ్​లో పాల్గొన్నాడు. అనంతరం మహారాష్ట్ర విధాన సభలో ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండే సహా ఇతర నేతల్ని కలిశాడు. అసెంబ్లీలో విన్నింగ్ స్పీచ్ ఇచ్చి అందర్నీ అలరించాడు.

ఇంకా వరల్డ్ కప్ సెలబ్రేషన్స్​లో బిజీగా ఉన్న రోహిత్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్​ను తలచుకొని అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. అతడ్ని మిస్ అవుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ద్రవిడ్ భాయ్​ను ఎంత మిస్ అవుతున్నానో చెప్పేందుకు మాటలు సరిపోవన్నాడు. చిన్నతనం నుంచి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ఆడుతూ వచ్చానని.. కోట్లాది మంది అభిమానుల్లాగే తాను కూడా ద్రవిడ్​కు సూపర్ ఫ్యాన్​నని ఆ పోస్ట్​లో రాసుకొచ్చాడు హిట్​మ్యాన్. ఆయనతో అంత క్లోజ్​గా ఉంటూ పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని తెలిపాడు. క్రికెట్​లో ఎన్నో ఘనతలు సాధించినప్పటికీ వాటిని ఇంటి దగ్గరే వదిలి తమకు కోచింగ్ ఇవ్వడానికి ద్రవిడ్ వచ్చాడని రోహిత్ చెప్పాడు. అతడు తనకు భార్య లాంటోడని ఫన్నీ కామెంట్ చేశాడు.

ద్రవిడ్ దగ్గర ఏ విషయం గురించి డౌట్ వచ్చినా అడిగేందుకు పూర్తి స్వేచ్ఛ ఉండేదన్నాడు రోహిత్. ఇంత కాలం గడిచినా క్రికెట్ మీద ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం ఇసుమంత కూడా తగ్గకపోవడం అద్భుతమన్నాడు. ద్రవిడ్​ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని.. ఆయనతో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని హిట్​మ్యాన్ వ్యాఖ్యానించాడు. ద్రవిడ్ నీ వర్క్ వైఫ్ అంటూ తన భార్య రితికా ఆటపట్టిస్తూ ఉంటుందని.. అలా పిలిపించుకోవడం నచ్చిందన్నాడు. ద్రవిడ్​ భాయ్​తో కలసి తాను కలసికట్టుగా వరల్డ్ కప్ డ్రీమ్​ను నిజం చేసుకున్నానని వివరించాడు రోహిత్. ఆయన తనకు కోచ్​ మాత్రమే కాదు.. తన నమ్మకం, తన ఫ్రెండ్ కూడా అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు హిట్​మ్యాన్. మరి.. ఇంత అనుబంధం ఉన్న ద్రవిడ్​ కోచ్​గా తప్పుకున్న నేపథ్యంలో కెప్టెన్​గా రోహిత్ జర్నీ ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.