Ruturaj Gaikwad: సెంచరీ చేసినా రుతురాజ్ ఖాతాలో చెత్త రికార్డ్.. పాపం చరిత్రలో ఒకే ఒక్కడు!

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్బుత శతకంతో చెలరేగాడు. కానీ సెంచరీ చేసినా.. తన పేరిట ఓ చెత్త రికార్డ్ ను లిఖించుకున్నాడు. ఆ రికార్డ్ ఏంటంటే?

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్బుత శతకంతో చెలరేగాడు. కానీ సెంచరీ చేసినా.. తన పేరిట ఓ చెత్త రికార్డ్ ను లిఖించుకున్నాడు. ఆ రికార్డ్ ఏంటంటే?

211 పరుగుల భారీ స్కోర్ ను కాపాడుకోలేక చేతులెత్తేసింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో 6 వికెట్ల తేడాతో వరుసగా రెండోసారి సీఎస్కేకు షాకిచ్చింది లక్నో సూపర్ జెయింట్స్. ఇక ఈ మ్యాచ్ లో అద్భుతమైన శతకంతో మెరిసినప్పటికీ.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ చెత్త రికార్డు సాధించిన ఒకే ఒక్క ప్లేయర్ గా చరిత్రలో నిలిచాడు. మరి సెంచరీ చేసినా.. రుతురాజ్ పేరిట నమోదు అయిన ఆ చెత్త రికార్డు ఏంటి? తెలుసుకుందాం పదండి.

చెపాక్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అజేయ శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో 60 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 3 సిక్సులతో 108 పరుగులు చేశాడు. అతడికి తోడు శివమ్ దుబే కూడా 66 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో చెన్నై 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే 211 టార్గెట్ ను కాపాడుకోలేకపోయింది సీఎస్కే. లక్నో బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ అద్భుత సెంచరీతో తమ టీమ్ ను గెలిపించాడు. 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 124 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉండగా.. సూపర్ సెంచరీ చేసినా.. తన పేరిట ఓ చెత్త రికార్డును లిఖించుకున్నాడు గైక్వాడ్.

ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసినా జట్టును గెలిపించుకోలేకపోయిన ఏకైక సీఎస్కే ప్లేయర్ గా వరస్ట్ రికార్డును నమోదు చేశాడు. ఈ రికార్డ్ తో పాటుగా మరో పేలవ ఘనతను కూడా రుతురాజ్ ఖాతాలో చేరింది. ఓడిపోయిన జట్టులో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 2వ ప్లేస్ లో నిలిచాడు గైక్వాడ్. ఐపీఎల్ లో ఇప్పటి వరకు రెండు సెంచరీలు బాదిన రుతురాజ్.. ఆ రెండు మ్యాచ్ ల్లోనూ తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు సెంచరీ చేసిన 3 మ్యాచ్ ల్లోనూ ఆర్సీబీ గెలవకపోవడం గమనార్హం. ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా(2), సంజూ శాంసన్(2) తర్వాత రుతురాజ్ రెండు సెంచరీలతో ఉన్నాడు. ఈ ముగ్గురు సెంచరీలు చేసినా.. తమ టీమ్స్ కు మాత్రం విజయాన్ని అందించలేక దురదృష్టవంతులుగా మిగిలిపోయారు. మరి గైక్వాడ్ సెంచరీ చేసినా చెత్త రికార్డ్ క్రియేట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments