iDreamPost
android-app
ios-app

దులీప్‌ ట్రోఫీ ఫస్ట్‌ మ్యాచ్‌లోనే తేలిపోయారు.. ఈ స్టార్లకి టీమిండియాలో నో ప్లేస్‌?

  • Published Sep 06, 2024 | 12:39 PM Updated Updated Sep 06, 2024 | 12:39 PM

Ruturaj Gaikwad, Rajat Patidar, Duleep Trophy 2024, IND vs BAN: దులీప్‌ ట్రోఫీలో విఫలం అవుతున్న కొంతమంది స్టార్లు.. టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టంగా మారింది. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Ruturaj Gaikwad, Rajat Patidar, Duleep Trophy 2024, IND vs BAN: దులీప్‌ ట్రోఫీలో విఫలం అవుతున్న కొంతమంది స్టార్లు.. టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టంగా మారింది. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Sep 06, 2024 | 12:39 PMUpdated Sep 06, 2024 | 12:39 PM
దులీప్‌ ట్రోఫీ ఫస్ట్‌ మ్యాచ్‌లోనే తేలిపోయారు.. ఈ స్టార్లకి టీమిండియాలో నో ప్లేస్‌?

టీమిండియాకు ఆడినంత మాత్రాన.. ఇక దేశవాళి క్రికెట్‌ ఆడాల్సిన అవసరం లేదని భావించే క్రికెటర్లకు చెంపపెట్టులా.. బీసీసీఐ గట్టి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒకరిద్దరు స్టార్‌ ప్లేయర్లు.. లైక్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తప్పించి.. మిగతా ప్లేయర్లంతా టీమిండియాకు ఆడని సమయంలో, అలాగే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు లేని టైమ్‌లో కచ్చితంగా డొమెస్టిక్‌ టోర్నీలు ఆడాల్సిందే అనే రూల్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రారంభమైన దులీప్‌ ట్రోఫీలో టీమిండియాకు ఆడిన చాలా మంది ప్లేయర్లు.. ఈ దేశవాళి టోర్నీ బరిలోకి దిగారు. భారీ అంచనాల మధ్య ఈ టోర్నీ ఆడేందుకు వచ్చిన ప్లేయర్లు.. తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే చాలా మంది విఫలం అయ్యారు.

రోహిత్‌ శర్మతో కలిసి టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగే యశస్వి జైస్వాల్‌ ఇండియా-బీ తరఫున ఆడుతూ 30 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే సర్ఫరాజ్‌ ఖాన్‌ 9, రిషభ్‌ పంత్‌ 7 రన్స్‌ మాత్రమే చేశారు, అలాగే నితీష్‌ కుమార్‌ రెడ్డి, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ సైతం డకౌట్‌ అయ్యారు. ఇక ఇండియా-డీ జట్టు తరఫున ఆడుతూ.. శ్రేయస్‌ అయ్యర్‌ 9, దేవదత్త్‌ పడిక్కల్‌ 0, కేఎస్‌ భరత్‌ 13 పరుగులు చేసి నిరాశపర్చారు. ఇండియా-సీ జట్టు తరఫున ఆడుతూ.. రుతురాజ్‌ గైక్వాడ్‌ 5, సాయి సుదర్శన్‌ 7, రజత్‌ పాటిదార్‌ 13 పరుగులు మాత్రమే చేసి విఫలం అయ్యారు. అయితే.. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు.. ఈ టోర్నీలో రాణించిన వారినే ఎంపిక చేస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా లాంటి స్టార్లు కాకుండా.. మిగతా స్పాట్‌లన్నీ దులీప్‌ ట్రోఫీలో రాణించిన వారితోనే భర్తీ చేయనున్నారు. యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌ లాంటి వాళ్లు ఓ మోస్తారుగా రాణించినా.. మిగతా ప్లేయర్లు మాత్రం చాలా మెరుగ్గా రాణిస్తేనే టీమిండియాలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌, సాయి సుదర్శన్‌, దేవదత్త్‌ పడిక్కల్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, రజత్‌ పాటిదార్‌, కేఎస్‌ భరత్‌ లాంటి వాళ్లు మాత్రం.. కచ్చితంగా రాణించి, నిలకడగా భారీ స్కోర్లు చేస్తేనే టీమిండియాలో ప్లేసు ఆశించేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుతం వారి ప్రదర్శన చూస్తుంటే.. బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో వీరికి చోటు దక్కడం కష్టమే అని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బీసీసీఐ అంత క్లియర్‌గా చెప్పిన తర్వాత కూడా.. సరైన ప్రదర్శన చేయకుండా ఉంటే తప్పు వీరిదే అవుతుంది. దేశవాళి క్రికెట్‌లో రాణించడం వేరు.. సరైన టైమ్‌లో రాణించడం వేరు. ఇప్పుడు బీసీసీఐ ఒక విధంగా బంపరాఫర్‌ ఇచ్చింది. దులీప్‌ ట్రోఫీలో రాణిస్తే.. టీమిండియాలో చోటిస్తామని చెప్పింది. ఎప్పుడూ డొమెస్టిక్‌ క్రికెట్‌ చూడని వాళ్లు కూడా.. ఈసారి దులీప్‌ ట్రోఫీపై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.. రాణిస్తే ఇలాంటి టోర్నీలో కదా రాణించాల్సింది. కానీ, కొంతమంది ప్లేయర్లు మాత్రం.. ఈ గోల్డెన్‌ ఛాన్స్‌ను మిస్‌ చేసుకుంటున్నారనే చెప్పాలి. ఈ ఛాన్స్‌ మిస్‌ అయి.. బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు టీమ్‌ ఎంపిక అయిపోయిన తర్వాత.. సెంచరీల మీద సెంచరీలు చేసినా ఉపయోగం ఉండదు. అందుకే.. టీమిండియాలో ప్లేస్‌ ఆశిస్తున్న ఐపీఎల్‌ స్టార్‌ క్రికెటర్లు.. మరింత ఏకాగ్రతతో ఆడి.. మంచి స్కోర్లు సాధించాలని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ యంగ్‌ ప్లేయర్ల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.