sree601
Duleep Trophy 2024, Ruturaj Gaikwad, Shreyas Iyer: దులీప్ ట్రోఫీలో తొలి ఫలితం వచ్చేసింది. ఇండియా సీ టీమ్ ఇండియా డీ టీమ్‌పై ఘన విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Duleep Trophy 2024, Ruturaj Gaikwad, Shreyas Iyer: దులీప్ ట్రోఫీలో తొలి ఫలితం వచ్చేసింది. ఇండియా సీ టీమ్ ఇండియా డీ టీమ్‌పై ఘన విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
sree601
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2024లో తొలి ఫలితం వచ్చింది. ఇండియా-సీ, ఇండియా-డీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా సీ ఘన విజయం సాధించింది. సీ టీమ్‌కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, టీమ్ డీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా డీ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్ 9, దేవదత్త్ పడిక్కల్ 0, కేఎస్ భరత్ 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. స్టార్ బ్యాటర్లు విఫలమైనా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఒక్కటే 86 పరుగులతో అదరగొట్టారు.
టీమ్ సీ బౌలర్లలో విజయ్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్ 2, హిమాన్షు చౌహాన్ 2 వికెట్లతో రాణించారు. ఒక తొలి ఇన్నింగ్స్‌లో దిగిన ఇండియా సీ టీమ్ కూడా పెద్దగా పరుగులేమీ చేయలేదు. వాళ్లు కూడా 168 పరుగులు మాత్రమే చేశారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 5, సాయి సుదర్శన్ 7 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశ పర్చారు. ఇంద్రజిత్ 72, అభిషేక్ పొరెల్ 34 పరుగులతో రాణించారు. ఇండియా డీ బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటాడు. అక్షర్ పటేల్ 2, జైన్ 2 వికెట్లతో పర్వాలేదనిపించారు.
ఇక రెండు ఇన్నింగ్స్‌లో ఇండియా-డీ టీమ్ 236 పరుగులు చేసింది. ఈ సారి కెప్టెన్ అయ్యర్ 54, పడిక్కల్ 56, భుయ్ 44 పరుగులతో రాణించారు. అయితే.. టాపార్డర్ బాగానే ఆడినా.. తర్వాత సీ టీ బౌలర్ మానవ్ సుతార్ చెలరేగి 7 వికెట్లు పటాపటా పడేయడంతో డీ జట్టు బ్యాటింగ్ ఎక్కువ సేపు కొనసాగలేదు. మొత్తంగా 233 పరుగుల టార్గెట్‌తో చివరిదైన రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా సీ టీమ్ 6 వికెట్లు నష్టపోయి టార్గెట్‌ను ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 46, అర్యన్ 47, రజత్ పాటిదార్ 44, అభిషేక్ పొరెల్ 35 పరుగులతో రాణించి.. టీమ్‌కు విజయాన్ని అందించాడు. ఇలా అయ్యర్ టీమ్‌పై రుతురాజ్ టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 7 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దాంతో ఈ మ్యాచ్‌కు అతన్నే హీరోగా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
RUTURAJ’s TEAM STARTS WITH A WIN….!!!! 👊
– India C defeated India D by 4 wickets, Terrific run chase in the 4th innings at Anantapur and took vital points in Duleep Trophy. pic.twitter.com/Rk2V184l3C
— Johns. (@CricCrazyJohns) September 7, 2024