iDreamPost
android-app
ios-app

Travis Head: ఇంగ్లండ్ బౌలర్లను దంచికొట్టిన హెడ్.. 20 ఫోర్లు, 5 సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్!

  • Published Sep 20, 2024 | 10:54 AM Updated Updated Sep 20, 2024 | 10:54 AM

Travis Head Century, AUS vs ENG: ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ.. సెంచరీ చేశాడు.

Travis Head Century, AUS vs ENG: ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ.. సెంచరీ చేశాడు.

Travis Head: ఇంగ్లండ్ బౌలర్లను దంచికొట్టిన హెడ్.. 20 ఫోర్లు, 5 సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్!

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ గత కొంత కాలంగా చెలరేగిపోతున్నాడు. మెున్న ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో పెను విధ్వంసం సృష్టించిన ఇతడు.. అదే జోరును కొనసాగిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న వన్డే సిరీస్ లో సైతం బ్రిటీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బ్లాస్టింగ్ సెంచరీ బాదాడు. దాంతో ఇంగ్లండ్ విధించిన భారీ టార్గెట్ సైతం చిన్నబోయింది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ఈ ఆసీస్ స్టార్ బ్యాటర్. హెడ్ తుఫాన్ బ్యాటింగ్ కారణంగా ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. సిరీస్ లో శుభారంభం చేసింది.

ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. నాటింగ్ హమ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. ఇంగ్లీష్ టీమ్ విధించిన 316 పరుగుల టార్గెట్ ను కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 44 ఓవర్లలోనే దంచి కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన బ్యాటింగ్ తో ఇంగ్లండ్ బౌలర్లను చితక్కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో వారిపై విరుచుకుపడ్డాడు. హెడ్ దెబ్బకు భారీ టార్గెట్ సైతం చిన్నబోయింది. అతడు బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఇంగ్లండ్ బౌలర్లు, ఫీల్డర్లు ప్రేక్షకపాత్ర వహించక తప్పలేదు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 154 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెడ్ కు తోడు మార్నస్ లబూషేన్ 77* రన్స్ తో రాణించాడు.

ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ బెన్ డకెట్ 91 బంతుల్లో 11 ఫోర్లతో 95 రన్స్ చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. విల్ జాక్స్ 62 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ 39, జాకబ్ బెతెల్ 35 పరుగులతో రాణించారు. ఇక ఆసీస్ బౌలర్లలో లబూషేన్, ఆడమ్ జంపా తలా 3 వికెట్లు పడగొట్టగా.. సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ బాల్ తో కూడా రాణించి.. 2 వికెట్లు పడగొట్టడం విశేషం. కాగా.. గత కొంత కాలంగా హెడ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టీమిండియాపై వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ మెుదలుకొని ఐపీఎల్ 2024 సీజన్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఫామ్ ను కొనసాగిస్తే.. త్వరలో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు కష్టాలు తప్పవని మాజీలు హెచ్చరిస్తున్నారు. మరి ట్రావిస్ హెడ్ బ్లాస్టింగ్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.