Somesekhar
T20 World Cup 2024: టీ20 క్రికెట్ చరిత్రలో దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఓ మైండ్ బ్లోయింగ్ ఘనతను సొంతం చేసుకున్నాడు పసికూన దేశానికి చెందిన ఓ అనామక ఆటగాడు. ఆ రికార్డ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
T20 World Cup 2024: టీ20 క్రికెట్ చరిత్రలో దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఓ మైండ్ బ్లోయింగ్ ఘనతను సొంతం చేసుకున్నాడు పసికూన దేశానికి చెందిన ఓ అనామక ఆటగాడు. ఆ రికార్డ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీ20 వరల్డ్ కప్ మెగాటోర్నీ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. తాజాగా ఈ టోర్నీలో భాగంగా జరిగిన ఒమన్ వర్సెస్ నమీబియా మ్యాచ్ లో నమీబియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్ కు దారితీసిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు మస్త్ మజాను అందించింది. సూపర్ ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విక్టరీతో టోర్నీని ఘనంగా ఆరంభించింది పసికూన నమీబియా. ఇక ఈ మ్యాచ్ లో హేమాహేమీ, దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఓ సాలిడ్ రికార్డ్ ను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు నమీబియా పేస్ బౌలర్ ట్రంపెల్ మెన్.
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీని నమీబియా విజయంతో ఆరంభించింది. బార్బడోస్ వేదికగా ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్లు చెలరేగడంతో.. 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఖలిద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక నమీబియా బౌలర్ రూబెన్ ట్రంపెల్ మెన్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం 110 పరుగుల ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులే చేసింది. జాన్ ఫ్రైలింగ్ 45 రన్స్ తో రాణించాడు.
మ్యాచ్ టై కావడంతో.. సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగులు రాబట్టింది. అనంతరం ఒమన్ వికెట్ కోల్పోయి కేవలం 10 రన్స్ మాత్రమే చేసింది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో నమీబియా పేసర్ ట్రంపెల్ మెన్ టీ20ల్లో సరికొత్త చరిత్రను లిఖించాడు. తద్వారా టీ20ల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. ఇంతకీ అతడు సాధించిన రికార్డ్ ఏంటంటే? అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ట్రంపెల్ ఘనత వహించాడు. ఇప్పటి వరకు జరిగిన 2633 ఇంటర్నేషనల్ టీ20ల్లో ఏ బౌలర్ కూడా ఈ రికార్డు నెలకొల్పలేదు. తాజాగా ఓ పసికూన దేశానికి చెందిన.. ఓ అనామక ప్లేయర్ ఈ ఘనతను తన పేరిట లిఖించుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ మ్యాచ్ లో తన తొలి ఓవర్లో ప్రజాపతి, ఇలియాస్ ను వరుస బంతుల్లో పెవిలియన్ కు చేర్చాడు. ఎంతో మంది దిగ్గజ బౌలర్లు ఉన్న క్రికెట్ లో.. టీ20ల్లో వారు సాధించలేని ఘనతను సాధించిన నమీబియా పేస్ బౌలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In a men’s T20I match
Only player to take 2 wickets on first 2 balls
Ruben Trumpelmann🇳🇦 v OMN, todayOnly player to take 3 wickets in first 4 balls
Ruben Trumpelmann🇳🇦 v SCOT, 2021Both are by same player in T20 World Cups!! pic.twitter.com/qyAfsP1P9n
— Kausthub Gudipati (@kaustats) June 3, 2024
Ruben Trumpelmann registered his best bowling figures in T20Is 👏🇳🇦#RubenTrumpelmann #NAMvOMAN #T20WorldCup pic.twitter.com/OpYEE2Z7oQ
— Sportskeeda (@Sportskeeda) June 3, 2024