iDreamPost
android-app
ios-app

Rohit Sharma: ఆ విషయం గురించి త్వరలోనే చెప్తా! రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

  • Published Jul 01, 2024 | 4:01 PM Updated Updated Jul 01, 2024 | 4:01 PM

ఫైనల్లో విజయం తర్వాత రిలాక్స్ గా గ్రౌండ్ లో పడుకుని ఉన్న పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రోహిత్. అయితే ఓ విషయం గురించి త్వరలోనే చెప్తానని అభిమానుల్లో ఆసక్తిని పెంచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఫైనల్లో విజయం తర్వాత రిలాక్స్ గా గ్రౌండ్ లో పడుకుని ఉన్న పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రోహిత్. అయితే ఓ విషయం గురించి త్వరలోనే చెప్తానని అభిమానుల్లో ఆసక్తిని పెంచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 01, 2024 | 4:01 PMUpdated Jul 01, 2024 | 4:01 PM
Rohit Sharma: ఆ విషయం గురించి త్వరలోనే చెప్తా! రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రోహిత్ శర్మ.. టీ20 వరల్డ్ కప్ టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ గా, బ్యాటర్ గా అన్నీ తానై ముందుండి జట్టును నడిపించిన తీరు అద్భుతం. ఇక ఈ ప్రపంచ కప్ ను అందుకోవడం ద్వారా దిగ్గజ ప్లేయర్ల సరసన నిలిచాడు. 1983లో కపిల్ దేవ్, 2007 టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న మహేంద్రసింగ్ ధోని సరసన నిలిచాడు రోహిత్ శర్మ. ఇక ఈ విజయం తర్వాత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్లో విజయం తర్వాత రిలాక్స్ గా గ్రౌండ్ లో పడుకుని ఉన్న పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రోహిత్. అయితే ఓ విషయం గురించి త్వరలోనే చెప్తానని క్యూరియాసిటినీ అభిమానుల్లో పెంచాడు.

టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే కాకుండా.. ఓపెనర్ గా బౌలర్ల భరతం పట్టాడు రోహిత్ శర్మ. ఈ మెగాటోర్నీలో 156 స్ట్రైక్ రేట్ తో 257 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వరల్డ్ కప్ ట్రోఫీని అందుకున్న కొన్ని గంటల తర్వాత హిట్ మ్యాన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అందులో రోహిత్ ఈ విధంగా రాసుకొచ్చాడు.

“వరల్డ్ కప్ గెలిచిన ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. పైగా ప్రపంచ కప్ గెలవడం నాకెంతో గొప్ప అని అచెప్పేందుకు చాలా పదాలు ఉన్నాయి. కానీ వాటిల్లో సరైన పదాలను వెతకలేకపోతున్నాను. కానీ ఈ విషయం గురించి నేను త్వరలోనే చెప్తాను. విజయం తర్వాత నేనెలా ఫీల్ అవుతున్నానో ఈ ఫొటో వివరిస్తుంది. ప్రస్తుతం వంద కోట్ల మంది కల సాకరమైన అద్భుతమైన క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను” అంటూ గ్రౌండ్ లో పడుకుని ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. కాగా.. ప్రపంచ కప్ విజయం తర్వాత టీ20లకు రోహిత్ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet