iDreamPost
android-app
ios-app

రోహిత్ మరో అరుదైన ఘనత.. ధోని ఆల్​టైమ్ రికార్డు సమం!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఫీట్ అందుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును సమం చేసి సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఫీట్ అందుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న రికార్డును సమం చేసి సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

రోహిత్ మరో అరుదైన ఘనత.. ధోని ఆల్​టైమ్ రికార్డు సమం!

టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఈ రేర్ ఫీట్ కు నిన్న భారత్, అఫ్గాన్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడిన టీమిండియాను రోహిత్ శర్మ, రింకూ సింగ్ ఆదుకున్నారు. అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ వీరవిహారం చేశాడు హిట్ మ్యాన్. అఫ్గాన్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ (69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

భారత్, అప్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ ఆధ్యాంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు విజయం నీదా నాదా అన్నట్లుగా దోబూచులాడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత మ్యాచ్ ఫలితం కోసం అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. గెలుపు కోసం ఇరు జట్లు పోటీపడగా సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. దీంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహించారు అంపైర్స్. చివరాఖరికి అఫ్గాన్ పై టీమిండియా విజయం సాధించి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ సారథి రోహిత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మిస్టర్ కూల్ పేరిట ఉన్న అరుదైన రికార్డును రోహిత్ సమం చేశాడు.

rohit beat dhoni record

టీ20 మ్యాచ్ లో అఫ్గాన్ పై విజయంతో రోహిత్ కెప్టెన్సీలో 42 విజయాలు నమోదయ్యాయి. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ లో రోహిత్ శర్మకు ఇది 42వ విజయం. దీంతో హిట్ మ్యాన్ ధోనీ ఆల్ టైమ్ రికార్డును సమం చేశాడు. భారత్ మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా 42 విజయాలు నమోదు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. కాగా ధోని ఈ అరుదైన ఫీట్ ను అందుకోవడానికి.. 72 మ్యాచ్‌ల్లో 42 విజయాలు నమోదు చేయగా హిట్ మ్యాన్ మాత్రం 54 మ్యాచ్‌ల్లోనే 42 విజయాలు అందుకుని సరికొత్త రికార్డును సృష్టించాడు.

దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు విన్ అయిన కెప్టెన్లుగా మొదటి స్థానంలో రోహిత్, ధోని కొనసాగుతున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా మరొక విజయం సాధిస్తే 43 విజయాలతో ధోనిని అధిగమించి రోహిత్ మొదటి స్థానానికి చేరుకుంటాడు. ఈ రేర్ ఫీట్ కు ఈ ఏడాది జరుగబోయే ఐసీసీ టీ20వ రల్డ్ కప్ వేదిక కానుంది. మరి రోహిత్ శర్మ ధోని రికార్డు సమం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి