iDreamPost
android-app
ios-app

Sarfaraz Khan: రోహిత్‌ మాస్టర్‌ ప్లాన్‌తో సర్ఫరాజ్‌ సూపర్‌ సక్సెస్‌! ఆ ఒక్క ఐడియాతో..

  • Published Feb 15, 2024 | 7:13 PM Updated Updated Feb 15, 2024 | 7:13 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా యువ క్రికెటర్‌, తొలి మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అదరగొట్టాడు. ఫస్ట్‌ మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే.. ఈ సక్సెస్‌లో కెప్టెన్‌ రోహిత్‌కు కూడా భాగముంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా యువ క్రికెటర్‌, తొలి మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అదరగొట్టాడు. ఫస్ట్‌ మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే.. ఈ సక్సెస్‌లో కెప్టెన్‌ రోహిత్‌కు కూడా భాగముంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

  • Published Feb 15, 2024 | 7:13 PMUpdated Feb 15, 2024 | 7:13 PM
Sarfaraz Khan: రోహిత్‌ మాస్టర్‌ ప్లాన్‌తో సర్ఫరాజ్‌ సూపర్‌ సక్సెస్‌! ఆ ఒక్క ఐడియాతో..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో తొలి రోజును టీమిండియా సంతృప్తికరంగానే ముగించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన తర్వాత సరైన స్టార్ట్‌ లభించకపోయినా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సెంచరీలతో చెలరేగాడు. వీరితో పాటు తొలి మ్యాచ్‌ ఆడుతున్న యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సైతం అద్బుతమైన హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. చాలా కాలంగా దేశవాళి క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో డొమెస్టిక్‌ డాన్‌ బ్రాడ్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న సర్ఫరాజ్‌.. టీమిండియాలో ప్లేస్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఏళ్ల నిరీక్షణకు తెరపడుతూ.. గురువారం ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడో టెస్ట్‌తో సర్ఫరాజ్‌కు అవకాశం దక్కింది. దిగ్గజ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా క్యాప్‌ అందుకుని టీమిండియా తరఫున టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

తొలి మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఒత్తిడి ఉండటం సహజం. పైగా సర్ఫరాజ్‌కు దక్కిన హైప్‌, అతనిపై ఉన్న అంచనాలతో ఈ యువ క్రికెటర్‌పై మరింత ఒత్తిడి ఉంది. ఇంత ప్రెషర్‌లోనూ సర్ఫరాజ్‌ అద్బుతంగా ఆడాడు. పైగా.. 48 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని.. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతూ.. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తంగా 66 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 62 పరుగులు చేసి తొలి మ్యాచ్‌లోనే సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. వేగంగా సెంచరీ వైపు అడుగులు వేస్తున్న సర్ఫరాజ్‌.. జడేజా మిస్‌ కమ్యూనికేషన్‌ కారణంగా దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు.

అయితే.. తొలి మ్యాచ్‌లోనే సర్ఫరాజ్‌ ఇంత ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడేందుకు ప్రధాన కారణం మాత్రం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే. అతను తీసుకున్న ఒక కీలక నిర్ణయంతోనే సర్ఫరాజ్‌ ఇంత మంచి ఇన్నింగ్స్‌ను ఆడగలిగాడు. అదేలాగో ఇప్పుడు చూద్దాం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 10 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ డకౌట్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఆ వెంటనే రజత్‌ పాటిదార్‌ 5 రన్స్‌ చేసి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఇలా 33 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తర్వాత 5వ స్థానంలో రావాల్సింది సర్ఫరాజ్‌. తొలి మ్యాచ్‌ ఆడుతున్న కుర్రాడు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయడం అంటే మాటలు కాదు. ఇక్కడే రోహిత్‌ శర్మ తన మాస్టర్‌ మైండ్‌కు పదును పెట్టాడు. వెంటనే సర్ఫరాజ్‌ను ఆపేసి.. 7వ స్థానంలో రావాల్సిన జడేజాను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు రప్పించాడు. సర్ఫరాజ్‌, జురెల్‌ ఇద్దరు డెబ్యూ ప్లేయర్లు.. 33 పరుగులకే 3 వికెట్లు పడిన పరిస్థితుల్లో ఉండే ఒత్తిడిలో వారితో బ్యాటింగ్‌ చేయడం అంత మంచిది కాదు. జడేజా అయితే కాస్త సీనియర్‌ కాబట్టి పరిస్థితి అర్థం చేసుకుని ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే వీలుంటుందని రోహిత్‌ ఆలోచించి అతన్ని పిలిపించాడు. ఈ ప్లాన్‌ సూపర్‌గా వర్క్‌ అవుట్‌ అయింది.

రోహిత్‌-జడేజా అద్భుతంగా ఆడి.. 200 పైచిలుకు పరుగులు భాగస్వామ్యం నమోదు చేసి.. టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. సెంచరీ తర్వాత రోహిత్‌ అవుట్‌ అయ్యాక సర్ఫరాజ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. అప్పటికే మంచి ప్లాట్‌ఫామ్‌ సెట్‌ అయి ఉంది. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. దీంతో సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేస్తూ.. తొలి మ్యాచ్‌లో అయినా కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫియర్‌లెస్‌ బ్యాటింగ్‌తో హాఫ్‌ సెంచరీ చేసి.. తొలి టెస్ట్‌ను తీపి గుర్తుగా చేసుకున్నాడు.

అలా కాకుండా 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే.. కచ్చితంగా ఇంత ఈజీగా అయితే ఉండేది కాదు. ఇంగ్లండ్‌ పేసర్లకు పిచ్‌ను స్వింగ్‌ లభిస్తుంది. వరుసగా మూడు వికెట్లు పడిన ఒత్తిడి ఉంటుంది. పైగా రోహిత్‌ శర్మతో కో ఆర్డినేషన్‌కు సర్ఫరాజ్‌కు టైమ్‌ పడుతుంది. ఇలా ఇన్ని ప్రతికూలతల మధ్య సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ కష్టమయ్యేది. ఒక వేళ అదే ఒత్తిడిలో అతను అవుటైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే రోహిత్‌ శర్మ తీసుకున్న ఒక్క నిర్ణయం సర్ఫరాజ్‌కు చాలా మేలు చేసింది. అందుకే తొలి మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ సక్సెస్‌లో రోహిత్‌కూ భాగం ఉందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.