Nidhan
Virat Kohli, Rohit Sharma, Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలిసిందే. కెరీర్ మొదట్నుంచి దేశానికి కలసి ఆడుతున్న వీళ్లు టీమిండియాను విజయాల బాటలో నడిపిస్తున్నారు.
Virat Kohli, Rohit Sharma, Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలిసిందే. కెరీర్ మొదట్నుంచి దేశానికి కలసి ఆడుతున్న వీళ్లు టీమిండియాను విజయాల బాటలో నడిపిస్తున్నారు.
Nidhan
రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ.. టీమిండియాకు మూలస్తంభాలుగా ఉన్న క్రికెటర్స్. ఒకరు కెప్టెన్‌గా ముందుండి టీమ్‌ను నడిపిస్తుంటే, మరొకరు బ్యాటింగ్ యూనిట్‌కు పెద్దన్నలా ఉంటూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపుగా ఒకే టైమ్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ట్ చేసిన రోహిత్-కోహ్లీ ఇప్పుడు కెరీర్ పీక్స్‌లో ఉన్నారు. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ నెగ్గడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇద్దరూ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా, ఎంత మంచి బాండింగ్ ఉన్నా వీళ్ల మధ్య కొందరు కంపారిజన్స్ చేస్తుంటారు. బ్యాటింగ్ దగ్గర నుంచి కెప్టెన్సీ వరకు ఎవరు ఏం సాధించారు? అనేది పోలికలు తెస్తుంటారు. అయితే చాలా విషయాల్లో ఇద్దరూ సమానంగా ఉన్నా ఫిట్‌నెస్‌లో మాత్రం హిట్‌మ్యాన్ కంటే విరాటే ముందంజలో ఉన్నాడు. అందుకే అతడ్ని టార్గెట్ చేసుకొని దూకుడు పెంచాడు రోహిత్.
ఫిట్నెస్ అనగానే క్రికెట్ వరల్డ్‌లో అందరూ కోహ్లీ పేరే చెబుతారు. ఒకప్పుడు బొద్దుగా ఉన్న విరాట్ కెరీర్లో దూసుకుపోవాలంటే ఫిట్నెస్ ముఖ్యమని గ్రహించాడు. ఫిట్‌గా మారే క్రమంలో ఫుడ్, వర్కౌట్స్ దగ్గర నుంచి అన్నీ మార్చేశాడు. అలా చాన్నాళ్లు కష్టపడి అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్‌గా మారాడు. అయితే అతడి సహచర క్రికెటర్, భారత కెప్టెన్ రోహిత్ మాత్రం కెరీర్ మొదట్లో బాగా ఫిట్‌గా ఉండేవాడు. సన్నగా ఉండే హిట్‌మ్యాన్ గ్రౌండ్లో మెరుపు వేగంతో కదిలేవాడు. అయితే రాన్రాను ఫిట్‌నెస్‌పై ధ్యాస తగ్గించడంతో బొద్దుగా మారాడు. అయినా అతడి గేమ్ ఏమాత్రం ఛేంజ్ కాలేదు. కానీ వికెట్ల మధ్య పరుగు, ఫీల్డింగ్ కదలికలపై ప్రభావం పడింది. అందుకే దాన్ని మార్చాలనే తాపత్రయంతో కోహ్లీని స్ఫూర్తిగా తీసుకున్నాడు రోహిత్. బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందు దొరికిన గ్యాప్‌ను ఫిట్‌గా మారేందుకు ఉపయోగించుకుంటున్నాడు.
కెరీర్‌ను మరికొన్నేళ్లు పొడిగించుకోవాలంటే ఫిట్‌గా ఉండక తప్పదు. పెద్దగా ఇంజ్యురీలు లేవు కాబట్టి ఫిట్నెస్ మెరుగుపర్చుకుంటే ఈజీగా ఇంకో మూడ్నాలుగేళ్లు గేమ్‌లో కొనసాగొచ్చు. బహుశా ఇదే ఆలోచనతో ఉన్నాడేమో.. రోహిత్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. జిమ్‌లో అతడు వర్కౌట్లు చేస్తూ, పరుగులు పెడుతూ చెమటలు చిందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బరువులు ఎత్తుతూ, రన్నింగ్ చేస్తూ, టఫ్ ఎక్సర్సైజులు చేస్తూ అందులో దర్శనమిచ్చాడు హిట్‌మ్యాన్. వీటిని చూసిన నెటిజన్స్.. రోహిత్ భలే ఫిట్‌గా కనిపిస్తున్నాడని మెచ్చుకుంటున్నారు. పొట్ట తగ్గి సూపర్ ఫిట్‌గా మారాడని, ఇక బంగ్లాదేశ్‌ను పోయించడం ఖాయమని చెబుతున్నారు. బొద్దుగా ఉంటేనే అందర్నీ ఆడుకున్నాడు, ఇప్పుడు ఒక్కొక్కరికి బడిత పూజేనని అంటున్నారు. అతడి జోరు చూస్తుంటే ఫిట్‌నెస్‌లో కోహ్లీని మించిపోయేలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇది కదా ఫ్యాన్స్ కోరుకున్నదని చెబుతున్నారు. మరి.. రోహిత్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Rohit Sharma is working hard in the gym ahead of the Test season. 👊
– Hitman is coming to rule….!!!! pic.twitter.com/l707iY0RjN
— Johns. (@CricCrazyJohns) September 11, 2024