Somesekhar
తన చిన్నతనంలో కోచ్ తో చేసిన ఓ ఛాలెంజ్ ను చేసి చూపించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మరి ఇంతకీ హిట్ మ్యాన్ బాల్యంలో చేసిన ఛాలెంజ్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తన చిన్నతనంలో కోచ్ తో చేసిన ఓ ఛాలెంజ్ ను చేసి చూపించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మరి ఇంతకీ హిట్ మ్యాన్ బాల్యంలో చేసిన ఛాలెంజ్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Somesekhar
రోహిత్ శర్మ.. ఈ పేరు వింటే చాలు.. ప్రపంచ క్రికెట్ లో అతడు సాధించిన రికార్డులు, టీమిండియాకు అందించిన విజయాలు మనకు గుర్తొస్తాయి. ఇక ఒక ప్లేయర్ గా, కెప్టెన్ గా రోహిత్ కు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువనే చెప్పాలి. ఆ విషయం చాలా సందర్భాల్లో నిరూపించుకున్నాడు, ప్రస్తుతం నిరూపిస్తూనే ఉన్నాడు. అయితే చెప్పి మరీ చేసి చూపించడంలో రోహిత్ దిట్ట. ఆ విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. తాజాగా తన చిన్నతనంలో కోచ్ తో రోహిత్ ఓ ఛాలెంజ్ చేశాడట. ప్రస్తుతం ఆ మాటను చేసి మరీ చూపించాడు హిట్ మ్యాన్. రోహిత్ కు సంబంధించిన చిన్ననాటి విషయాలను కోచ్ దినేశ్ వివరించారు.
రోహిత్ చిన్ననాటి కోచ్ దినేశ్ మాట్లాడుతూ..”రోహిత్ కు చిన్నప్పటి నుంచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఆ విషయం అతడిని చూడగానే నాకు అర్థమైంది. అతడు ముంబై అండర్-19 టీమ్ కు సెలెక్ట్ అయ్యాడు. ఒకరోజు మేమిద్దరం ఓ రోడ్డుపై ఆగాం. అప్పుడు పక్కనుంచి మెర్సిడిస్ బెంజ్ కారు వెళ్తూఉంది. దాన్ని చూసిన రోహిత్.. ఏదో ఒకరోజు ఆ కారును నేను కొంటాను. అని నాతో చెప్పాడు. అతడి మాటలకు నేను షాక్ అయ్యాను. నీకు పిచ్చిపట్టిందా? అంత ఖరీదైన కారును నువ్వెలా కొంటావ్? అని అడిగా. దానికి రోహిత్.. మీరు చూస్తూ ఉండండి సర్.. నేను ఆ కారును కొని చూపిస్తా” అని చెప్పాడని దినేశ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రోహిత్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపిగా ఫీల్ అవుతున్నారు. దటీజ్ రోహిత్.. చెప్పి మరీ కొట్టాడు.. మా హిట్ మ్యాన్ మెునగాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రోహిత్.. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడ్డాడు. తన కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియా కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు. మరి చెప్పి మరీ ఖరీదైన కారుకొన్న రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma’s childhood coach said, “once Rohit and I saw a Mercedes car and he said, ‘Sir, I will buy this car one day’. I told him, ‘are you mad? These are too expensive’. But he said, ‘you see, I will buy it'”. pic.twitter.com/XJ1HEoYNd2
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 27, 2024
ఇదికూడా చదవండి: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. ఆ సెంచరీ..!