iDreamPost

రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. ఆ సెంచరీ..!

ఇంగ్లండ్ పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్ పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. ఆ సెంచరీ..!

ఇంగ్లండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది టీమిండియా. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా టీమ్ మెుత్తం సంతోషంలో ఉంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రా(నాలుగో టెస్ట్ కు), శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్ ప్లేయర్లు లేకపోయినప్పటికీ.. యువ క్రికెటర్లతో అద్భుతం చేశాడు కెప్టెన్ రోహిత్. తన అసాధారణ అనుభవంతో.. ఇంగ్లండ్ ను మట్టికరిపించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు హిట్ మ్యాన్. మరి రోహిత్ కు దక్కిన ఆ గౌరవం ఏంటి? తెలుసుకుందాం పదండి.

రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా గత కొంతకాలంగా అద్భుత విజయాలు సాధిస్తూ వస్తోంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో భారత జట్టును ఫైనల్ వరకు చేర్చాడు హిట్ మ్యాన్. కెప్టెన్ గానే కాకుండా.. బ్యాటర్ గానూ సత్తాచాటాడు. కానీ టీమ్ కు మాత్రం కప్ ను అందించడంలో విఫలం అయ్యాడు. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తనదైన సారథ్యంతో దూసుకెళ్తున్నాడు. యువ క్రికెటర్లకు స్వేచ్ఛను ఇస్తూ.. వారి నుంచి ఆటను రాబట్టుకుంటున్నాడు. ఇక ఈ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న రోహిత్ కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులో 11వ తరగతి మ్యాథ్స్ సిలబస్ లో రోహిత్ పేరిట ఉన్న 35 బంతుల్లో టీ20 సెంచరీ రికార్డును పాఠ్యాంశంగా పొందుపరిచారు. ఈ సెంచరీని ఎగ్జాంపుల్ గా తీసుకుని లెక్కల పరీక్షల్లో ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ కాన్సెప్ట్ పై పలు ప్రశ్నలు అడిగారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే రోహిత్ క్రికెట్ కెరీర్ లో రికార్డులను ఇలా పాఠ్యాంశాలుగా పొందుపరచడం కొత్తేమీ కాదు. గతంలో ఓ అప్పర్ ప్రైమరీ పాఠ్య పుస్తకంలో హిట్ మ్యాన్ కు సంబంధించిన పాఠం చేర్చారు. ఇక ఆ రికార్డు శతకాన్ని రోహిత్ 2017 డిసెంబర్ లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో చేశాడు. కేవలం 35 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సులతో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. ఇది కొన్ని రోజులు ఇంటర్నేషనల్ టీ20ల్లో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా కొనసాగింది.

కాగా.. గతేడాది చివర్లో జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా ఈ రికార్డును బ్రేక్ చేశాడు. అతడు మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో 34 బంతుల్లోనే వంద పరుగులు బాది రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డు సైతం ఎంతో కాలం నిలవలేదు. తాజాగా ఫిబ్రవరి 27న నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. నేపాల్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. కేవలం 33 బాల్స్ లోనే సెంచరీ చేసి.. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మరి రోహిత్ రికార్డును పాఠంగా చేర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: మూడోసారి తండ్రైన స్టార్ క్రికెటర్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి