ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయంపై సారథి రోహిత్ శర్మ సంతోషంగా లేడు. అదేంటి? విజయం సాధిస్తే హ్యాపీగా ఉండాలి గానీ.. బాధలో ఉండటం ఏంటని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి రోహిత్ అసంతృప్తికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయంపై సారథి రోహిత్ శర్మ సంతోషంగా లేడు. అదేంటి? విజయం సాధిస్తే హ్యాపీగా ఉండాలి గానీ.. బాధలో ఉండటం ఏంటని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి రోహిత్ అసంతృప్తికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ లో టీమిండియా విజయ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో ఆరు విజయాలు సాధించి.. సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు రోహిత్ శర్మ. మిగతా బ్యాటర్లు విఫలమైన చోట.. 87 పరుగులతో సత్తా చాటాడు హిట్ మ్యాన్. అనంతరం బౌలర్లు చెలరేగడంతో.. 129 పరుగులకు కుప్పకూలింది డిఫెండింగ్ ఛాంపియన్. దీంతో 100 రన్స్ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంపై సారథి రోహిత్ శర్మ సంతోషంగా లేడు. అదేంటి? విజయం సాధిస్తే హ్యాపీగా ఉండాలి గానీ.. బాధలో ఉండటం ఏంటని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి రోహిత్ అసంతృప్తికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 100 రన్స్ తో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సమష్టిగా రాణించిన టీమిండియా ప్లేయర్లు అద్భుత విజయాన్ని జట్టుకు అందించారు. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. జట్టు గెలిచినప్పటికీ సంతోషంగా లేమని, మా బ్యాటింగ్ బాలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ..”ఈ వరల్డ్ కప్ లో తొలిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేశాం. దీంతో మాపై కాస్త ఒత్తిడి ఉంది. అదీకాక ఈ రోజు ఇంగ్లాండ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. అయితే ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు అనుభవం ఉన్న ఆటగాళ్లు అందరూ కలిసి జట్టును గెలిపించడంలో ముందుంటారు.
ఈ మ్యాచ్ ద్వారా ఆ విషయం మరోసారి రుజువైంది. బ్యాటర్లు, బౌలర్లు పట్టుదలగా పోరాడి జట్టుకు విజయం అందించారు. అయితే ఈ మ్యాచ్ లో మా బ్యాటింగ్ మరీ అంత గొప్పగా ఏమీ లేదు. స్టార్టింగ్ లోనే 3 వికెట్లు కోల్పోవడం మా తప్పిదమే. ఇలాంటి పరిస్థితుల్లో విలువైన భాగస్వామ్యం నెలకొల్పడం ముఖ్యం. అదే మేం చేసి చూపించాం. అయితే నాతో సహా మిగిలిన వారు చివరి వరకు ఇంకాస్త పోరాడాల్సింది” అంటూ బ్యాటింగ్ వైఫల్యం గురించి తన అసంతృప్తిని వెల్లగక్కాడు. మ్యాచ్ లో ఎప్పుడైనా బ్యాటర్లు రాణించి.. మెరుగైన స్కోర్లు సాధిస్తేనే బౌలర్లు ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చేందుకు ఆస్కారముంటుందని రోహిత్ చెప్పుకొచ్చాడు. మరి ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బ్యాటర్లు తమ స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోయారన్న రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.