iDreamPost
android-app
ios-app

ఫస్ట్ టెస్ట్ విక్టరీతో​ ఫుల్ హ్యాపీగా రోహిత్.. అంతా బాగానే ఉన్నా ఆ ఒక్కడికి​ అన్యాయం!

  • Published Sep 23, 2024 | 5:34 PM Updated Updated Sep 23, 2024 | 5:34 PM

Rohit Sharma, KL Rahul, IND vs BAN: తొలి టెస్టులో బంగ్లాదేశ్​ను చిత్తు చిత్తుగా ఓడించడంతో టీమిండియా ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే అంతా బాగానే ఉన్నా.. ఆ ఒక్కడి విషయంలో మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Rohit Sharma, KL Rahul, IND vs BAN: తొలి టెస్టులో బంగ్లాదేశ్​ను చిత్తు చిత్తుగా ఓడించడంతో టీమిండియా ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే అంతా బాగానే ఉన్నా.. ఆ ఒక్కడి విషయంలో మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

  • Published Sep 23, 2024 | 5:34 PMUpdated Sep 23, 2024 | 5:34 PM
ఫస్ట్ టెస్ట్ విక్టరీతో​ ఫుల్ హ్యాపీగా రోహిత్.. అంతా బాగానే ఉన్నా ఆ ఒక్కడికి​ అన్యాయం!

తొలి టెస్టులో బంగ్లాదేశ్​ను చిత్తు చిత్తుగా ఓడించడంతో టీమిండియా ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సిరీస్ మొదలవడానికి ముందు భారత్​ను ఓడిస్తామంటూ ఓవరాక్షన్ చేసింది ఆ జట్టు. పాకిస్థాన్​ను వైట్​వాష్ చేశాం.. రోహిత్ సేనను కూడా అదే రీతిలో ఓడిస్తామంటూ బిల్డప్ ఇచ్చింది. కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. మన చేతిలో ఏకంగా 280 పరుగుల భారీ తేడాతో మట్టికరిచింది బంగ్లాదేశ్. తొలి రోజు మార్నింగ్ సెషన్​ను మినహాయిస్తే ఎక్కడా భారత్​కు ఎదురే లేకుండా పోయింది. అన్ని విభాగాల్లోనూ చెలరేగి ఆడిన మెన్ ఇన్ బ్లూ.. ప్రత్యర్థిని చావుదెబ్బ తీసింది. మనతో మ్యాచ్ అంటే భయపడేలా చేసింది. దీంతో ఆడియెన్స్, ఫ్యాన్స్ సహా అందరూ సంతోషంగా ఉన్నారు. కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంతా బాగానే ఉన్నా.. ఆ ఒక్కడి విషయంలో గౌతీ-రోహిత్ వ్యవహరించిన తీరు ఇప్పుడు డిస్కషన్స్​కు దారితీసింది.

బంగ్లాదేశ్​పై మొదటి టెస్టులో ఘనవిజయం సాధించడంతో రోహిత్, గంభీర్ ఆనందంగా ఉన్నారు. టీమ్ సభ్యులంతా ఈ సక్సెస్​ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాన్పూర్ టెస్ట్​లో ప్రత్యర్థికి ఇంకా గట్టిగా ఇచ్చిపడేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే ప్లానింగ్ కూడా స్టార్ట్ చేసేశారు రోహిత్-గౌతీ ద్వయం. అయితే వాళ్లు ఓ విషయంలో విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్​ విషయంలో హిట్​మ్యాన్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. అతడికి రోహిత్ అన్యాయం చేశాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంచి ఛాన్స్ మిస్ చేశాడని.. రాహుల్​ ప్లేస్​ను రిస్క్​లో పడేశాడని అంటున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. గాయం తర్వాత చాన్నాళ్లకు బంగ్లా సిరీస్​తో టెస్ట్ టీమ్​లోకి కమ్​బ్యాక్ ఇచ్చాడు రాహుల్. అయితే అతడికి చెన్నై టెస్ట్​లో సరైన ఆపర్చునిటీ దొరకలేదు.

చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్​లో క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్​కు దిగిన రాహుల్ 52 బంతుల్లో 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో రెండో ఇన్నింగ్స్​లోనైనా అదరగొడతాడేమోనని అనుకున్నారు అభిమానులు. అందుకు తగ్గట్లే సెకండ్ ఇన్నింగ్స్​లో బాగా ఆడాడు. 19 బంతుల్లో 22 పరుగులు చేశాడు. 4 బౌండరీలు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. భారీ ఇన్నింగ్స్ ఖాయం అనుకుంటున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. మరిన్ని బంతులు ఆడే అవకాశం ఇచ్చి ఉంటే అతడు కనీసం హాఫ్ సెంచరీ బాదేవాడు. అప్పటికే అతడు చాలా వేగంగా ఆడుతున్నాడు. కాబట్టి ఇంకో ఐదారు ఓవర్లు ఆడినా ఈజీగా ఫిఫ్టీ కంప్లీట్ అయ్యేది.

హాఫ్ సెంచరీ కొట్టి ఉంటే టచ్ కోల్పోయి ఇబ్బంది పెడుతున్న రాహుల్​కు బిగ్ బూస్టప్​గా ఉండేది. కానీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేశాడు హిట్​మ్యాన్. ఇంకా రెండున్నర రోజుల ఆట మిగిలి ఉన్నా.. మూడో రోజు మరో సెషన్ కంటే ఎక్కువ గేమ్ ఆడాల్సి ఉన్నా బంగ్లాను త్వరగా ఛేజింగ్​కు ఆహ్వానించాడు. సుదీర్ఘ టెస్ట్ సీజన్​ నేపథ్యంలో రాహుల్ లాంటి మిడిలార్డర్ బ్యాటర్​ ఫామ్ అందుకోవడం కీలకం. కానీ ఆ ఛాన్స్​ను కెప్టెన్ చేజేతులా మిస్ చేశాడు. ఒకవేళ అతడు మళ్లీ ఫెయిలైతే టీమ్​లో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే రాహుల్​కు రోహిత్ అన్యాయం చేశాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రతి ప్లేయర్​కు సపోర్ట్​గా ఉండే హిట్​మ్యాన్​ నుంచి రాహుల్​కు తప్పకుండా బ్యాకప్, టీమ్​లో బెర్త్ పక్కా అనే భరోసా లభించి ఉంటుందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. రాహుల్ విషయంలో రోహిత్ తప్పు చేశాడా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.