Nidhan
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో అతడికి నెక్స్ట్ లెవల్లో క్రేజ్ ఉంది.
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో అతడికి నెక్స్ట్ లెవల్లో క్రేజ్ ఉంది.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో అతడికి నెక్స్ట్ లెవల్లో క్రేజ్ ఉంది. హైదరాబాద్‌లో టీమిండియా మ్యాచ్ ఉంటే చాలు.. స్టేడియంలో హిట్‌మ్యాన్ నామస్మరణ చేయడం చూస్తూనే ఉంటాం. అతడి బర్త్‌డేకు కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తెలిసిందే. రోహిత్ కూడా ఇక్కడి ఫ్యాన్స్ గురించి పలుమార్లు మాట్లాడాడు. టీమిండియాతో పాటు గతంలో ఐపీఎల్లో తెలుగు జట్టు డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడాడతను. అతడు టీమ్‌లో ఉన్నప్పుడు ట్రోఫీ కూడా గెలిచింది డీసీ. ఆ తర్వాత రోహిత్ ముంబై ఇండియన్స్‌కు మారగా.. డెక్కన్ ఛార్జర్స్ జట్టును బ్యాన్ చేశారు. అయితే తెలుగు నేలతో, ఇక్కడి అభిమానులతో రోహిత్ అనుబంధం మాత్రం అలాగే ఉండిపోయింది.
రోహిత్ ముంబైకి మారినందుకు ఆ టీమ్‌కు ఇక్కడి నుంచి అభిమానించే వారూ పెరిగారు. అలా హిట్‌మ్యాన్‌కు కెరీర్ ఆసాంతం ఇక్కడి ఫ్యాన్స్ నుంచి ఆదరణ లభిస్తూనే ఉంది. వారిని సంతోషపర్చడానికి ఓ పని చేశాడు భారత కెప్టెన్. తెలుగులో మాట్లాడి అందర్నీ అలరించాడు. ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్న రోహిత్.. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన అతడ్ని కొందరు ఫ్యాన్స్ తెలుగులో మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. దీంతో వెంటనే ‘ఎట్లా ఉన్నారు’ అని అడిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ తెలుగు సూపర్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, రోహిత్‌కు తెలుగు నేలతో సంబంధం ఉందనే విషయం తెలిసిందే. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన హిట్‌మ్యాన్.. అక్కడే క్రికెట్ నేర్చుకొని ఈ స్థాయికి చేరుకున్నాడు. అయితే అతడి తల్లి పూర్ణిమ సొంతూరు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కావడం గమనార్హం. రోహిత్ బయట ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్, మరాఠీ మాట్లాడుతూ కనిపిస్తాడు. అయితే అతడి ఇంట్లో మాత్రం అందరూ తెలుగులోనే మాట్లాడతారట. రోహిత్‌కు మాతృభాషపై ఎక్కువగా పట్టు లేకపోయినా బాగానే అర్థం అవుతుందట. ఓ సందర్భంలో అతడు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తమ ఇంట్లో తెలుగు వంటకాలే ఎక్కువగా చేస్తుంటారని, తన అమ్మ చేతి వంటను మించినది మరొకటి లేదన్నాడు. దీన్ని బట్టే ఇక్కడి భాష, ఆహారంపై రోహిత్‌కు ఉన్న ఇష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Captain Rohit Sharma speaking TELUGU. 😀🔥 pic.twitter.com/ICTDkiGoGd
— Johns. (@CricCrazyJohns) July 15, 2024