SNP
BCCI, Gautam Gambhir, Duleep Trophy: భారత టెస్టు క్రికెటర్లకు బీసీసీఐ దిమ్మతిరిగే కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కొత్త రూల్స్ అన్ని గంభీర్ పెట్టి ఉంటాడనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
BCCI, Gautam Gambhir, Duleep Trophy: భారత టెస్టు క్రికెటర్లకు బీసీసీఐ దిమ్మతిరిగే కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కొత్త రూల్స్ అన్ని గంభీర్ పెట్టి ఉంటాడనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
భారత క్రికెట్‌లో గంభీర్ తాలూకు ప్రకంపనలు కనిపిస్తున్నాయి. అతను హెడ్ కోచ్‌గా వస్తే జట్టులో భారీ ప్రక్షాళన ఖాయమని చాలా కాలంగా పలు వ్యాఖ్యలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె గంభీర్‌ను బీసీసీఐ భారత హెడ్ కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నెల చివర్లో శ్రీలంకతో టీమిండియా ఆడబోయే టీ20, వన్డే సిరీస్‌లతో గంభీర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే.. బాధ్యతలు చేపట్టేకంటే ముందు గంభీర్ తన మార్క్ కోచింగ్‌ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టెస్టు క్రికెట్ ఆడే ప్లేయర్లకు బీసీసీఐ సరికొత్త కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడటం ప్రారంభించే ముందే.. దేశవాళి క్రికెట్‌లో దులీప్ ట్రోఫీ ఆడాలని టెస్టు స్పెషలిస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ కండీషన్ పెట్టనున్నట్లు సమాచారం. అదే జరిగితే.. చాలా మంది స్టార్ క్రికెటర్లు దేశవాళి క్రికెట్‌లో కనిపించనున్నారు. అయితే.. ఈ కండీషన్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రీత్ బుమ్రా కాస్త మినహాయింపు ఇవ్వనున్నట్లు సమాచారం. అది కూడా పూర్తి మినహాయింపు కాదు.. దేశవాళి క్రికెట్‌లోని దులీప్ ట్రోఫీలో ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.
కచ్చితంగా ఆడాల్సిన అవసరం లేదని మాత్రం చెప్పలేదు. ఒక వేళ ఆడాలని అనుకుంటే.. రోహిత్, కోహ్లీ, బుమ్రా కూడా దులీప్ ట్రోఫీలో పాల్గొన వచ్చు. ఆ ట్రోఫీలో ప్రదర్శనతో పాటు వారి టెస్టు కెరీర్‌ను రీసెంట్‌గా ఆడిన టెస్టు మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకొని రాబోయే టెస్టు సిరీస్‌లకు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే.. ఈ ఆలోచన కచ్చితంగా గంభీర్ బుర్రలోంచి పుట్టినదే అయి ఉంటుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆటగాళ్లు బెసిక్ లెవెల్ నుంచి స్ట్రాంగ్‌గా ఉండాలని గతంలో గంభీర్ చాలా సార్లు చెప్పాడు కూడా. అయితే.. కొంతమంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో వచ్చిన తర్వాత.. దేశవాళి క్రికెట్‌ను పూర్తిగా మర్చిపోతారు. హర్ధిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఇలా చాలా మందే ఉన్నారు. ఇలాంటి ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకే గంభీర్ ఇలాంటి రూల్స్ పెట్టేడేమో అని క్రికెట్ అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BCCI would want the Test specialist to play in the Duleep Trophy in August ahead of the Test season. [PTI]
– For Seniors like Rohit, Virat & Bumrah, it will be their choice to play or not. pic.twitter.com/Kbya5SDOvw
— Johns. (@CricCrazyJohns) July 16, 2024