SNP
Rohit Sharma, India vs England: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతున్న క్రమంలో భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ఒక బ్యాడ్ న్యూస్‌చెప్పింది. అందేంటో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, India vs England: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతున్న క్రమంలో భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ఒక బ్యాడ్ న్యూస్‌చెప్పింది. అందేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా.. 477 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో పాటు.. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్త్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియాకు మంచి స్కోర్ దక్కింది. మొత్తంగా ఇంగ్లండ్‌పై 259 పరుగుల లీడ్ సాధించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ను మరింత ఇబ్బంది పెడుతూ విజయం దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
విరాట్ కోహ్లీ, షమీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ స్టార్లు లేకపోయినా.. మధ్యలో బుమ్రా కూడా లేకపోయినా.. యువకులతో కూడిన జట్టును ఆరంభం నుంచి తన భుజాలపై వేసుకుని గెలిపించుకుంటూ వస్తున్నాడు రోహిత్ శర్మ. ఐదు టెస్టుల సుదర్ఘీ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైనా.. నిరాశ చెందకుండా యువ క్రికెటర్లతో నిండిన టీమ్‌తోనే అద్భుతాలు చేస్తున్నాడు. వరుసగా మూడు టెస్టుల గెలిచి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. నామమాత్రమైన చివరి టెస్టులో కూడా రెస్ట్ తీసుకోకుండా.. అంతా యువకులతో నిండిన టీమ్‌కు తన అవసరం ఉందని గుర్తించి, ఐదో టెస్టులో కూడా బరిలోకి దిగాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆడటమే కాకుండా సెంచరీ కూడా బాదేశాడు.
కానీ, అనూహ్యంగా మూడో రోజు ఆటలో ఫీల్డ్‌లోకి దిగలేదు. దీంతో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. రోహిత్ ఎందుకు ఫీల్డింగ్‌కు రాలేదని కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే బీసీసీఐ వారికి బ్యాడ్ న్యూస్ చెప్పింది. వారు భయపడుతున్నట్లుగానే రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లుగా బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకే రోహిత్ మూడో రోజు ఫీల్డింగ్‌కి రాలేదని వెల్లడించింది. అయితే.. రోహిత్ వెన్నునొప్పి ఎంత తీవ్రత ఉంది? ఎప్పటి వరకు కొనుకుంటాడు? అనే విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో.. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో రోహిత్ పాల్గొంటాడా? లేదా? అనే విషయంపై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
UPDATE: Captain Rohit Sharma has not taken the field on Day 3 due to a stiff back.#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) March 9, 2024