ఆ రోజు అందరూ నన్ను తిట్టారు.. ఇప్పుడు వాళ్లే మెచ్చుకుంటున్నారు: గంగూలీ

Sourav Ganguly: బీసీసీఐ మాజీ బాస్, లెజెండ్ సౌరవ్ గంగూలీ గురించి తెలిసిందే. ఏ విషయం మీదైనా ఆయన కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాడు. తన అభిప్రాయాన్ని ముఖం మీద సూటిగా చెప్పడం దాదా నైజం.

Sourav Ganguly: బీసీసీఐ మాజీ బాస్, లెజెండ్ సౌరవ్ గంగూలీ గురించి తెలిసిందే. ఏ విషయం మీదైనా ఆయన కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాడు. తన అభిప్రాయాన్ని ముఖం మీద సూటిగా చెప్పడం దాదా నైజం.

బీసీసీఐ మాజీ బాస్, లెజెండ్ సౌరవ్ గంగూలీ గురించి తెలిసిందే. ఏ విషయం మీదైనా ఆయన తడబడకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు. ముఖం మీద సూటిగా చెప్పడం దాదా నైజం. ప్రశంసలు, విమర్శలను ఒకేలా తీసుకుంటూ తనకు అప్పగించిన బాధ్యతల్ని నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతాడాయన. ప్లేయర్​గా, కెప్టెన్​గా, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్​గా, కామెంటేటర్​గా.. ఇలా రోల్ ఏదైనా తన పని తాను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్​తో చేయడం మీదే ఫోకస్ చేస్తుంటాడీ దిగ్గజం. రిటైర్మెంట్ తర్వాత బెంగాల్ క్రికెట్​తో పాటు భారత క్రికెట్​ బోర్డులోనూ చక్రం తిప్పాడు. బీసీసీఐ ప్రెసిడెంట్​గా పనిచేశాడు దాదా. అయితే ఆ టైమ్​లో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి.

బీసీసీఐ బాస్​గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీని కావాలనే కెప్టెన్సీ నుంచి గంగూలీ తప్పించాడనే ఆరోపణలు వచ్చాయి. టీ20 సారథ్యం నుంచి తప్పుకున్న కోహ్లీ.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం కెప్టెన్​గా కంటిన్యూ అవ్వాలని అనుకున్నాడు. కానీ అందుకు ససేమిరా అన్న దాదా.. అతడ్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాడని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఈ కాంట్రవర్సీ కారణంగా కోహ్లీ-గంగూలీ చాన్నాళ్లు మాట్లాడుకోలేదు. ఐపీఎల్ టైమ్​లో ఎదురుపడినా పలకరించుకోలేదు. విరాట్​ను కాదని రోహిత్​ శర్మకు లిమిటెడ్ ఓవర్స్ పగ్గాలు ఇచ్చాడు గంగూలీ. ఆ తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అన్ని ఫార్మాట్లకూ హిట్​మ్యానే సారథిగా మారాడు. అయితే రోహిత్​ను కెప్టెన్ చేయడం ఏంటని అప్పట్లో గంగూలీని చాలా మంది తిట్టారు. ఇప్పుడు ఇదే విషయాన్ని అతడు గుర్తుచేసుకున్నాడు.

‘టీమిండియా కెప్టెన్​గా రోహిత్​ శర్మను నేను ఎంపిక చేసినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఇదేం నిర్ణయమంటూ నన్ను తిట్టిపోశారు. కానీ ఇప్పుడు అదే రోహిత్ సారథ్యంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్​ను గెలుచుకోవడంతో ఆ రోజు తిట్టినవాళ్లే ఇప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు. రోహిత్​ను నేను కెప్టెన్​గా నియమించిన విషయం కూడా చాలా మంది మర్చిపోయారు’ అని గంగూలీ స్పష్టం చేశాడు. అన్ని తిట్లూ గుర్తున్నాయిని.. ఏదీ మర్చిపోలేదంటూ ఎమోషనల్ అయ్యాడు. కాగా, కోహ్లీ వివాదంపై దాదా పలుమార్లు క్లారిటీ ఇచ్చాడు. తాను కావాలని అతడ్ని కెప్టెన్సీ నుంచి తప్పించలేదన్నాడు. వన్డేలు, టెస్టులకు సారథిగా ఉంటానని అతడు అన్నాడని.. అయితే ఉంటే రెడ్ బాల్, వైట్ బాల్​కు వేర్వేరు కెప్టెన్లు ఉండాలని లేదా ఒకే కెప్టెన్ ఉండాలని తాము క్లియర్​గా చెప్పామన్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నందుకే వన్డేల నుంచి కూడా తీసేసి రోహిత్​ను ఎంపిక చేశామన్నాడు. మరి.. తిట్లు మర్చిపోలేదంటూ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments